అదిలాబాద్, ఫిబ్రవరి 28, (way2newstv.com)
టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు సర్కార్ పెద్దపీట వేస్తోంది. కాంట్రాక్టర్ల అవినీతి అక్రమాలు, రింగ్ విధానానికి చెక్‌పెట్టింది. తాజాగా తునికాకు యూనిట్ల కేటాయింపులో సీల్డ్ టెండర్ విధానాన్ని రద్దు చేసి ఈ-టెండర్‌ను అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారానే తునికాకు యూనిట్లను కాంట్రాక్టర్లకు కేటాయించనుంది. అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఐదు సబ్ డివిజన్లలో 21యూనిట్ల ద్వారా తునికాకు సేకరించనున్నారు. మొత్తంగా 196 కల్లాలను ఏర్పాటు చేసి 1000 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించడమే లక్ష్యంగా అటవీశాఖ ముందుకువెళ్తోంది. ఈ టెండర్ల ప్రక్రియ మూడు విడతల్లో చేపట్టనున్నారు. నూతన విధానంతో అధికారులకు వ్యయప్రయాసలు తగ్గడంతో పాటు అర్హులైన వారికే కాంట్రాక్టు దక్కనుంది.ఓ వైపు సాగునీటి లభ్యత తక్కువగా ఉండడం మరో వైపు భానుడి భగభగకు బయటకు అడుగుపెట్టని జనం.. వెరసి ఎండాకాలంలో పంటల సాగు విస్తీర్ణం తక్కువ ఉంటుంది.
ఇక అమల్లోకి ఈ టెండర్లు
ఈ నేపథ్యంలో కూలి పని మీదే ఆధారపడి జీవిస్తున్న వారికి ఎండాకాలం గడ్డుకాలం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తునికాకు సేకరణ వాటికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తోంది. ఈ క్రమంలో కూలీల ఉపాధికి మరింత భద్రత కల్పించి ప్రభుత్వ ఆదాయం పెంచడమే లక్ష్యంగా తునికాకు యూనిట్ల టెండర్ విధానంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందున్న సీల్డ్ టెండర్ విధానాన్ని అమలు చేయనుంది. దీని ద్వారానే తునికాకు యూనిట్లను కాంట్రాక్టర్లకు కేటాయించనుంది. పాత విధానం వల్ల కాంట్రాక్టర్లు రింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ నూతన విధానం వల్ల రింగ్‌కు పుల్‌స్టాఫ్ పడనుంది.ఆదిలాబాద్ జిల్లాలో ఇంతకు ముందు తునికాకు యూనిట్లను కాంట్రాక్టర్లకు కేటాయించడానికి సీల్డ్ టెండర్ విధానం అమల్లో ఉండేది. ఈ విధానం వల్ల కాంట్రాక్టర్లు రింగ్ అయి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారు. మరో వైపు టెండర్ల నిర్వహణ సమయంలో రాష్ట్రంలోని డీఎఫ్‌వోలందరూ హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఈ విధానానికి చెక్‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. సీల్డ్ టెండర్ విధానాన్ని రద్దు చేసి దీని స్థానంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ టెండర్ విధానం ప్రవేశపెట్టి అమల్లోకి తీసుకవస్తోంది. ఈ ఏడాది 21యూనిట్లలో 1000స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యం ఉండగా.. 196కల్లాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి టెండర్లను కేటాయించేందుకు ఈ-టెండర్ విధానాన్ని అమలు చేయనుంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. తునికాకు యూనిట్లకు ఈ టెండర్ విధానం మూడు విడతల్లో నిర్వహించనుంది.