ఏప్రిల్ 1 నుంచి ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్ బాదుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏప్రిల్ 1 నుంచి ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్ బాదుడు

ముంబై, మార్చి 7, (way2newstv.com)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమరా? అయితే మీ నడ్డివిరిచేందుకు బ్యాంక్ సిద్దమైంది. క్రెడిట్ కార్డులపై లేట్ పేమెంట్ చార్జీలను సవరించింది. క్రెడిట్ కార్డు ఉపయోగించిన తర్వాత నెలవారీ బిల్లు వస్తుంది. ఇందులో టోటల్ అమౌంట్, మినిమమ్ అమౌంట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. డబ్బులు ఉంటే డ్యూడేట్ లోపల టోటల్ అమౌంట్ కట్టేయాలి. డబ్బులు లేకపోతే మినిమమ్ బ్యాలెన్స్ అయినా కట్టడానికి ప్రయత్నించాలి. వీటిల్లో దేన్ని చెల్లించకపోయినా లేట్ పేమెంట్ చార్జీలు పడతాయి. బ్యాంక్ 2019 ఏప్రిల్ 1 నుంచి రూ.500 దాటిన స్టేట్‌మెంట్‌పై లేట్ పేమెంట్ చార్జీలు పెంచింది. అందువల్ల హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుదారులు డ్యూడేట్ కన్నా ముందే బిల్లు చెల్లించేందుకు ప్రయత్నించండి. చెల్లించాల్సిన మొత్తం బిల్లులో 5 శాతాన్ని మినిమమ్ బ్యాలెన్స్ కింద చెల్లిస్తే సరిపోతుంది. ఇన్‌ఫినియా కార్డులు మినహా మిగతా వాటికి సవరించిన చార్జీలు వర్తిస్తాయి. 


 ఏప్రిల్ 1 నుంచి ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్ బాదుడు 

స్టేట్‌మెంట్ బ్యాలెన్స్ రూ.100 వరకు ఉంటే అప్పుడు లేట్ పేమెంట్ చార్జీలు ఉండవు. అదే బ్యాలెన్స్ రూ.100 నుంచి రూ.500 వరకు ఉంటే లేట్ పేమెంట్ చార్జీలు రూ.100గా ఉంటాయి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అయితే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. స్టేట్‌మెంట్ బ్యాలెన్స్ రూ.501 నుంచి రూ.5,000లోపు ఉంటే అప్పుడు లేట్ పేమెంట్ చార్జీ రూ.500 అవుతుంది. ప్రస్తుతం ఈ చార్జీ రూ.400. ఏప్రిల్ నుంచి రూ.100 అదనంగా కట్టాలి.స్టేట్‌మెంట్ బ్యాలెన్స్ రూ.5,001 నుంచి రూ.10,000 వరకు ఉంటే.. అప్పుడు లేట్ పేమెంట్ చార్జీ రూ.600 కట్టాలి. ఇప్పుడు ఇది రూ.500. రూ.10,001 నుంచి రూ.25,000 వరకు ఉంటే అప్పుడు లేట్ పేమెంట్ చార్జీ రూ.800 కట్టాలి. ఇప్పుడు ఇది రూ.750. ఇకపోతే రూ.25,000కు పైన స్టేట్‌మెంట్ ఉంటే అప్పుడు లేట్ పేమెంట్ చార్జీ రూ.950 అవుతుంది. ఇప్పుడు ఇది రూ.750. లేట్ పేమెంట్ చార్జీలను తప్పించుకునేందుకు డ్యూ డేట్ లోపు బిల్లు చెల్లించండి. మొత్తం బిల్లు కుదరకపోతే మినిమమ్ బ్యాలెన్స్ కట్టండి. క్రెడిట్ కార్డు బిల్లు పూర్తిగా కడితే వడ్డీ పడదు. లేకపోతే వడ్డీ భారం మోయాల్సి వస్తుంది