1000 కోట్లతో మాల్యా షేర్ల విక్రయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

1000 కోట్లతో మాల్యా షేర్ల విక్రయం

ముంబై, మార్చి 27, (way2newstv.com)
విజ‌య్ మాల్యా ఆస్తుల అమ్మ‌కానికి కోర్టు ఓకే చెప్పేసింది. మాల్యాకు చెందిన సుమారు వెయ్యి కోట్ల విలువైన షేర్ల‌ను అమ్మేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎస్‌బీఐ బ్యాంకుల‌కు మాల్యా వేల కోట్ల రుణాల‌ను ఎగ‌వేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ బ‌కాయిల‌ను రిక‌వ‌ర్ చేసే క్ర‌మంలో తాజ‌గా పీఎంఎల్ఏ కోర్టు ఈ ఆదేశాల‌ను జారీ చేసింది.


1000 కోట్లతో మాల్యా షేర్ల విక్రయం

యునైటెడ్ బ్రెవ‌రీస్‌కు చెందిన షేర్ల‌ను అమ్మేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. మాల్యా ఆస్తుల అమ్మ‌కంపై స్టే ఇచ్చే శ‌క్తి కోర్టుకు లేద‌ని స్పెష‌ల్ జ‌డ్జి ఎంఎస్ అజ్మీ తెలిపారు. బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో మంగ‌ళ‌వారం యునైటెడ్ బ్రెవ‌రీస్ షేర్లు 2 శాతం పెరిగాయి. 74 ల‌క్ష‌ల షేర్ల‌ను అమ్మితే సుమారు 999 కోట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు