చిత్తూరు మార్చ్ 25 (way2newstv.com)
చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండల కేంద్రం సమీపంలోని రెక్కల గుంటపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. కలిచర్ల జడ్పి హైస్కూల్ విద్యార్థులు పరీక్షలు వ్రాయడానికి సుమోలో పెద్దమండ్యం జడ్పి హైస్కూల్ సెంటరుకు వెళు తుండగా పెద్దమండ్యం మండల కేంద్రం సమీపంలోని రెక్కల గుంటపల్లి బస్టాప్ వద్ద మలుపులో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
అదుపు తప్పిన సుమో...ఇద్దరు 10 వ తరగతి విద్యార్థులు మృతి
ఒక విద్యార్థి శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన నలుగురు విద్యార్థులను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరో విద్యార్థి రెడ్డిశేఖర్ మృతి చెందాడు. ఘటనలో గాయాపడిన మరొక విద్యార్థి పరిస్థితి విషమంగా వుంది. ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో విద్యార్ధులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు, ఉపాద్యాయులు, గ్రామస్తులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు.