ఏప్రిల్ 17 నుండి 19 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏప్రిల్ 17 నుండి 19 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల, మార్చి 25 (way2newstv.com
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. చైత్రశుద్ధ త్రయోదశిరోజు అనగా ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 7.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తియిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజు ఏప్రిల్ 18వ తేదీన శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు బంగారు రథం అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. 


 ఏప్రిల్  17 నుండి 19 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

చివరిరోజు ఏప్రిల్ 19వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయాన్ని చేరుకుంటారు.  ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6.00 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.  వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు ఏర్పాడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏప్రిల్ 17వ తేదీన సహస్ర కలశాభిషేకం, ఏప్రిల్ 18వ తేదీన తిరుప్పావడసేవ, ఏప్రిల్ 19వ తేదీన తోమాలసేవ, అర్చన, నిజపాద దర్శనం సేవలను రద్దు చేశారు. అదేవిధంగా ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొంటారు.