విజయవాడ, మార్చి 19 (way2newstv.com):
ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ చేపట్టిన చర్యలు సత్ ఫలితాలను ఇస్తున్నాయి. మధ్యం నిల్వలు, అనధికార సరఫరాపై ఉంచిన నిఘా ఫలితంగా మునుపెన్నడూ లేని విధంగా అక్రమాలకు అడ్డుకట్టపడే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. అధికారికంగాఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ముందే రాష్ట్ర అబ్కారీ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా చేపట్టినచర్యల ఫలితంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం పెద్దఎత్తున అక్రమ మధ్యం నిల్వలను వెలికి తీసిసార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు పరోక్షంగా కారణం అవుతోంది.
18 రోజుల్లో రూ.10 కోట్ల మధ్యంస్వాధీనం
మునుపెన్నడూ లేని స్ధాయిలోఎక్సైజ్ శాఖ సిబ్బంది పరుగులు పెడుతుండగా, ఇప్పటి వరకు దాదాపు పదికోట్ల రూపాయల విలువైనఅక్రమ మధ్యం సీజ్ అయ్యింది. మొత్తంగా రెండు లక్షల యాభైవేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోగా, ఐడి లిక్కర్ 33వేల లీటర్లు, ఎన్డిపిఎల్ రెండు వేల రెండు వందల లీటర్లు, ఐఎంఎఫ్ఎల్ విభాగంలో రెండు లక్షల లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ నోటిఫికేషన్ నుండి పోలింగ్ వరకు 2.43 లక్షల లీటర్ల మధ్యం స్వాధీనంచేసుకోగా దాని విలువ రూ. 9.53 కోట్లుగా ఉంది.
అంటే 2014 ఎన్నికల వేళ మొత్తం కాలానికి గాను రూ.9.53 కోట్ల విలువైన మధ్యం స్వాధీనం చేసుకోగా ప్రస్తుతం పోలింగ్కు మరో 25 రోజ లసమయం ఉండగానే, కేవలం 18 రోజుల వ్యవధిలోనేరూ.10 కోట్ల బెంచ్మార్క్ను దాటింది. ఈ నేపధ్యంలోమంగళవారం సచివాలయంలో తనను కలిసినపాత్రికేయిల మాట్లాడుతూ మీనా రాష్ట్ర వ్యాప్తంగాఎక్సైజ్ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ఫలితంగానే ఇంత పెద్ద ఎత్తునమధ్యం నిల్వలను స్వాధీనం చేసుకోగలుగుతున్నామన్నారు.