తెలంగాణలో కొత్తగా మరో 20 లక్షల మంది ఓటర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో కొత్తగా మరో 20 లక్షల మంది ఓటర్లు

హైద్రాబాద్, మార్చి 9, (way2newstv.com)
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇటీవలే శాసన సభ ఎన్నికలు ముగిసినప్పటికీ 2019వ సంవత్సరం జనవరి ఒకటో తేదికి 18సంవత్సరాలు నిండిన వారికి ఓటు హాక్కు కలిగించటానికి అవకాశం రావటంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్లకు చేరుకుంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.సుమారు 20లక్షలకు పైగా  ఓటర్లు కొత్తగా పెరగటంతో పోలింగు బూతుల సంఖ్యా పెరగటం, దానికి అనుగుణంగా ఈవీఎం యంత్రాలు, వివిప్యాడ్ లు అధికంగా అవసరం పడటంతో పాటు గతంలో కంటే ఎక్కువమంది సిబ్బంది ఎన్నికల నిర్వహణకు అవసరం పడటంతో దానికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఓటరుగా దరఖాస్తు చేసుకున్నవారు, చిరునామా మార్పిడి, ఇతర పొరపాట్లను సరిదిద్దే  కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటించనుండటంతో రాజకీపా ర్టీలకు, అధికారులు అనుసరించాల్సిన ఎన్నికల నియమావళి ,ఎన్నికలు నిర్వహణకు అవసరమైన నిధులు సమీకరించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.త్వరలోనే ఎన్నికల అధికారులకు సిబ్బందికి క్షేత్ర స్థాయై నుంచి పోలింగు బూత్ స్థాయి వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.


 తెలంగాణలో కొత్తగా మరో 20 లక్షల మంది ఓటర్లు

ఎన్నికల ఏర్పాట్లు ఫై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి అరోరా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారు లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అదేవిధంగా బుధవారం సాయంత్రం ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తో సమావేశం నిర్వహించారు.ఎన్నికల ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించటానికి త్త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ అరోరా ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులు, ఇతర అధికారులుతో సమావేశం అయి ఎన్నికల ఏర్పాట్లును పరిశీలిస్తున్నారు.ఎన్నికల నిర్వహణకు మరో నాలుగు వేలు పోలింగు కేంద్రాలు అవసరం పడతాయని అధికారులు అంచనా వేశారు.ప్రస్తుమున్న సుమారు 34వేళా కేంద్రాలకు అదనం గా ఈ పోలింగు కేంద్రాలను అవసరం పడతాయని ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు.ప్రతి పోలింగు కేంద్రంలోను 1200 మంది నుంచి 1400మంది ఓటు హక్కు వినియోగించుకోవటానికి వీలు ఉంటుంది.సుమారు 20లక్షలుకు పైగా ఓటర్లు అధికంగా కావటంతో నాలు వేల  పోలింగు బూతులు అదనంగా ఏర్పాటు చేయాలని,ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో అవసరమైన పాఠ శాలలు,ఇతర ప్రభుత్వ భవనాలను ఎంపిక చేయాల్సి రావటం తో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం అధికారులు వేచి చూస్తున్నారు.అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 17770 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు రాష్ట్రానికి వస్తున్నాయి.