విజయవాడ, మార్చ్ 20 (way2newstv.com)
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసే గాజువాక, భీమవరం శాసనసభ స్థానాలకు 21, 22వ తేదీల్లో నామినేషన్ వేస్తారు. ఈ రెండు స్థానాల్లో అయన స్వయంగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నెల 21వ తేదీన గాజువాకలో నామినేషన్ పత్రాలు సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు.
21న గాజువాకలో, 22న భీమవరంలో పవన్ కల్యాణ్ నామినేషన్
ఆ రోజు ఉదయం 10గం.30ని. నుంచి 1గం. మధ్య పవన్ కల్యాణ్ నామినేషన్ వేస్తారు. 22వ తేదీన భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గం. నుంచి 5 గం. మధ్య రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేస్తారు.