*ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా మరో 11 గుర్తింపు కార్డులు*
హైదరాబాద్ మార్చ్ 28 (way2newstv.com)
హైదరాబాద్ జిల్లాలో ఉన్న 41,77,703 మంది ఓటర్లకు ఈ నెల 31వ తేదీ నుండి ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగా ఓటరు స్లిప్‌ల పంపిణీని పూర్తిచేయనున్నట్టు, బిఎల్ఓల ద్వారా ఈ స్లిప్‌లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఈ క్రింది గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు.
ఈ నెల 31వ తేదీ నుండి ఓటరు స్లిప్‌ల పంపిణీ
కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్థారణకు ఓటరు స్లిప్పులు చూపితే సరిపోదని, ఓటరు గుర్తింపు కార్డులయినా చూపాలి లేదా అవి చూపలేనివారు వారి గుర్తింపు నిర్థారణకు కింద తెలిపిన ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదయినా ఒకదానిని చూపాలని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ స్పష్టం చేశారు.
1. పాస్‌పోర్ట్
2. డ్రైవింగ్ లైసెన్స్
3. ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫై కార్డ్
4. ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్
5. పాన్ కార్డు
6. ఆర్.జి.ఐ, ఎన్.పి.ఆర్ స్మార్ట్ కార్డు
7. జాబ్ కార్డు
8. హెల్త్ కార్డు
9. ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్
10. ఎం.ఎల్.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం.
11. ఆధార్ కార్డు