35 డిగ్రీల దాటిన టెంపరేచర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

35 డిగ్రీల దాటిన టెంపరేచర్

హైద్రాబాద్, మార్చి 12, (way2newstv.com)
ప్రచండ భాను డు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారం భం లోనే తన తడాఖా చూపుతున్నాడు. ఎండలతో జనాలను ఠారెత్తిస్తున్నాడు. హైదరాబాద్‌లో 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు కాంక్రీట్ మహారణ్యం కారణంగా ఇప్పుడు అతినీల లోహిత కిరణాల తీవ్రత భారీగా పెరిగింది. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ఇండెక్స్ (యూవీ) సూచీ ‘పది’పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
కానీ మార్చిలోనే పది మార్కు దాటేసింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొన సాగితే ఏప్రిల్, మేలో యూవీ సూచీ 12 పాయిం ట్లకు చేరే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల కారణంగా సూర్యుడి నుం చి వెలువడిన ఉష్ణం భూ ఉపరితల వాతావర ణానికే పరిమితం అవుతోంది. 


35 డిగ్రీల దాటిన టెంపరేచర్

ఫలితంగా మార్చి నెలల్లో వికిర తీవ్రతపెరుగుతోంది.హైదరాబాదును గ్రీన్‌సిటీగా  మార్చేందుకు  ఉద్యమ స్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్ర మం ఉద్ద్యేశం బాగానే ఉన్నా.. గ్రీన్‌బెల్ట్  గణనీయంగా పెంచేందుకు దోహదపడలేదని పర్యావర ణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హరిత హారంలో భాగంగా గత ఏడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను పంపిణీ చేశారని  బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థ లాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 8 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారుదీంతో నగరంలో  గ్రీన్‌బెల్ట్ 8 శాతానికే పరిమి తమైందని పేర్కొంటున్నారు. పెరుగుతన్న ఎండలకు విరుగుడు విరివిగా  చెట్లు పెంచడ మేనని యుద్దప్రాతిపదికన ఇది జరగాలని కోరుతున్నారు.