37 సంవత్సరాలు తరువాత...సైకిల్ గుర్తు లేని బ్యాలెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

37 సంవత్సరాలు తరువాత...సైకిల్ గుర్తు లేని బ్యాలెట్

హైదరాబాద్ మార్చ్ 26  (way2newstv.com)             
సుమారు 37 సంవత్సరాలు తరువాత బ్యాలెట్ పేపరు లో సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో 1981వ సంవత్సరంలో హైదరాబాద్ నదిఒడ్డున అవతరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 1983వ సంవత్సరం లో జరిగిన ఎన్నికలలో ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం సైకిల్ గుర్తును కేటాయించింది.అదే గుర్తు తో ఎన్నికలలో పోటీచేసిన తెలుగుదేశంపార్టీ విజయం సాధించి అధికారంలోనికి వచ్చింది.అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్నా ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరం గా ఉండటంతో ఆ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కు ఏప్రిల్ 11 వ తేదీన జరిగే ఎన్నికలో ఉపయోగించే బాలెట్ పేపర్ లో స్థానం లేకుండా పోతోంది.1983 వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు జరిగిన అన్నిలోక్ సభ శాసనసభ  ఎన్నికలలోను,స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన విషయం తెలిసిందే.


37 సంవత్సరాలు తరువాత...సైకిల్ గుర్తు లేని బ్యాలెట్ 

అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికలలోను తెలుగుదేశం పార్టీ పోటీచేయడంతో ఆ పార్టీ గుర్తు లేకుండా బ్యాలెట్ లేదు.చివరికి 2018వ సంవత్సరంలో శాసనసభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల సంగ్రామంలో నిలిచింది... 1983వ సంవత్సరంలో తొలిసారి రంగంలోనికి దిగిన ఈ ఆపార్టీ సైకిల్ గుర్తు ఫై పోటీ చేసి రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది.1984 వ సంవత్సరంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన లోక్ సభ ఎన్నికలలో దేశ వ్యాప్తం గా కాంగ్రెస్ పార్టీ విఙాదుందుభి మోగిస్తే ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ 30స్థానాలను గెలుచుకొని లోక్ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.ఆ తరువాత జరిగిన ఎన్నికలలో కొన్ని దపాలు గొప్ప విజయాలు సాధించినా  మరికొన్ని సార్లు పరాజయంను చవిచూసింది.2000వ సంవత్సరంలో జరిగిన హైదరాబాద్ మహా నగరపాలక సంస్థకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికలలో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది.ఎన్ని విజయాలును తెలుగుదేశం పార్టీకి అందించిన సైకిలు గుర్తు ఈ థపా బ్యాలట్ పేపరులో కనిపించకపోవడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఉనికి కోల్పోతూ వస్తున్న సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా ముందుకు రాకపోవటం విశేషం