పెరిగిన ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పెరిగిన ధరలు

భారంగా మారిన డబుల్ నిర్మాణాలు
హైద్రాబాద్, మార్చి 6, (way2newstv.com)
 డబుల్ బెడ్ ఇళ్లు ఉచితంగా నిర్మిస్తామని హామీ ఇచ్చి గ్రేటర్ పరిధిలో 2 లక్ష ఇళ్లు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించారు. గడిచిన ప్రభుత్వంలో సికింద్రాబాద్ బోయగూడ మొదటిసారి ఇళ్లు నిర్మించి అట్టహాసంగా గృహా ప్రవేశాలు చేశారు. ఈ పథకం ఎంతో గొప్పదని దేశ స్థాయిలో ప్రభుత్వానికి ప్రశంసలు రావడంతో ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్రాంతాలు చూసి ఇప్పటి వరకు 107 ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తున్నారు. రెండు నెలల్లో 30 వేల ఇళ్లు పూర్తిఅవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇళ్లు నిర్మించే కాంట్రాక్టర్లు ఇప్పడు ఉన్న రేట్లకు తాము కట్టలేమని, తాజా ధరల ప్రకారం బిల్లులు చెల్లిస్తే వేగంగా నిర్మాణాలు చేపడుతామంటున్నారు. సిమెంటు, స్టీల్, ఇటుక, కూలీల దినసరికూలీ పెరగడంతో తమపై అధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


పెరిగిన ధరలు

టెండర్ల వేసినప్పుడు బస్తా సిమెంటు ధర రూ.230 ఉండేది ప్రసుత్తం రూ. 260 నుంచి రూ.285వరకు పెరిగిందని, దీంతో బస్తాకు రూ.25 వరకు పడుతుందని, ప్రభుత్వం బస్తాకు రూ.30 వరకు ఇస్తే రెండేళ్ల వరకు సిమెంటు ధర పెరిగిన భరించి సకాలంలో నిర్మించి ఇస్తామని పేర్కొంటున్నారు. భవన నిర్మాణంలో కీలక ఉపయోగించే స్టీల్ ధరలు కూడా పెరిగాయని, ప్రభుత్వం టన్నుకు రూ. 4500 వరకు చెల్లిస్తుందని, కానీ ప్రస్తుతం వ్యాపారులు రూ. 4900నుంచి రూ.5600వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. రేట్ల ప్రకారం కొనుగోలు చేస్తున్నామని, దీంతో మరింత బరువు పడుతుందని, స్టీల్ ధరలను కూడా అధికారులు పరిశీలించి, ఉన్నరేట్ల ప్రకారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇళ్ల నిర్మాణాలు సగం వరకు యంత్రాలతో పనిచేసిన మేస్త్రీలు, దినసరి కూలీలు పెట్టుకోవాల్సి వస్తుంది. వారి కూలీల రేట్లు కూడా భాగానే పెరిగాయని, ఏడాదిన్న కితం మేస్త్రీ కూలీ రోజుకు రూ.550 ఉండే ఇప్పడు రూ.600 ఇవ్వాల్సి వస్తుందని, చేతికింది కూలీలకు రూ.450 చెల్లిస్తే, ప్రస్తుతం రూ.520వరకు ఇస్తున్నామని వెల్లడిస్తున్నారు. ఈధరల విషయంలో ఒక భారమైతే ఇప్పటివరకు నిర్మించి ఇళ్లకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయని సుమారు రూ. 320కోట్లు వరకు ఇవ్వాలని, మరో రూ.300కోట్ల వరకు పనులు పూర్తిచేశామని వాటి బిల్లులు త్వరలో పెడుతామని వీటిని చెల్లిస్తే ఇళ్ల నిర్మాణాల్లో మరింత వేగం పెంచుతామంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇళ్లుకు ప్రభుత్వం రూ. 350కోట్లు మాత్రమే చెల్లించిందని, బిల్లుల చెల్లింపులో జాప్యం, పెరిగిన ధరలకు తగ్గటుగా మెటీరియల్‌కు ధరలు ఇవ్వకపోవడంతో తమకు మోయలేని భారం మీద పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ కొలువుదీరడంతో నూత న మంత్రులకు తమ ఇబ్బందులు వివరిస్తామని, ప్రభు త్వం పూర్తిస్దాయిలో సహకారం అందిస్తే ఏడాదిలోపు ల క్ష ఇళ్లు పూర్తిచేస్తామని, గ్రేటర్ ఎన్నికలవరకు మరో 50 వేల ఇళ్లకు పనులు ప్రారంభిం చవచ్చని వివరిస్తున్నారు.