నిజామాబాద్, మార్చి 25 (way2newstv.com)
నిజామాబాద్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసేందుకు చివరి రోజు సోమవారం రైతులు బారులు తీరారు. ఎన్నికల కార్యాలయం గేటు ముందు ఎర్రజొన్న, పసుపు రైతులు భారీ ఎత్తున చేరారు. ఉదయం 10 నుంచే సుమారుగా మూడు వందలమంది మంది రైతులు నామినేషన్ దాఖలు కోసం తరలి వచ్చారు. 4 0గ్రామాల నుండి ఒకరు, ఇద్దరు చొప్పున నామినేషన్ కోసం వారు తరలివచ్చారు. నామినేషన్ వేసే రైతులు, వివిధ పార్టీల నాయకులతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసేందుకు రైతులు బారులు
సోమవారం ఉదయం నాటికి దాదాపు 57 మంది రైతులు తమ నామినేషన్ దాఖలు చేసారు. తమను నామినేషన్ వేయకుండా కొంతమంది అడ్డుకున్నారనీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రైతులు ఫిర్యాదు చేసారు. దీంతో రిటర్నింగ్ అధికారి నుండి ఈసీనివేదిక కోరింది. సంవత్సర కాలంగా తాము ఎన్నో ధర్నాలు చేశామని.. కానీ తమ బాధల్ని పట్టించుకునే వారే లేరని ఓ రైతు మీడియాకు తెలిపారు. తమ బాధ నేతలకు అర్థం కావాలంటే అధిక మొత్తంలో నామినేషన్లు వేయడమే మార్గమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని.. పసుపునకు, మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.