క్రీడలు మీ జీవితాంతం స్నేహితుడిలా ఉండాలి

ఎస్సీ వసతి గృహా విద్యార్థినీ, విద్యార్థుల జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్
సిద్ధిపేట, మార్చి 01: (way2newstv.com)
ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని.. ఆ క్రీడ మీ స్నేహితుడిలా.. జీవితాంతం ఉండాలని విద్యార్థినీ, విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ భాస్కర్ సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రోఫెసర్ జయశంకర్ మైదానంలో శుక్రవారం ఉదయం జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులు జరిగే వసతి గృహా విద్యార్థినీ, విద్యార్థుల జిల్లాస్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ కాగడ అందించి ర్యాలీతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 


క్రీడలు మీ జీవితాంతం స్నేహితుడిలా ఉండాలి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల నుంచి చదువుకే అధిక ప్రాముఖ్యతను ఇవ్వడం, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేపట్టి విద్య కోసం అందరిలో ఉత్సాహాన్ని నింపడం జరిగిందని వివరిస్తూ.. ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు నుంచి విద్యపై మంచి అవగాహన వచ్చిందని., ఇప్పుడున్న పరిస్థితులలో విద్య అంటే సమాజంలో గౌరవం పెరిగిందని కలెక్టర్ క్రిష్ణ చెప్పుకొచ్చారు. 15 సంవత్సరాల క్రితం సమాజంలో చదువుతోనే అన్నీ అన్నట్లుగా అనే అపోహ ఉండేదని., మీరు చదువుల్లో రాణించాలంటే.. మతిస్థిమితమైన క్రీడలు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న క్రీడలలో ఓటమి చెందామని నిరుత్సాహ పడొద్దని సూచనలు చేశారు. మీకు ఆసక్తి కలిగించేలా క్రీడలలో ఏలాంటి క్రీడలు ఆడాలంటే.. టీమ్ స్పోర్ట్స్, కబడ్డీ, వాలీబాల్ ఇతరత్రా క్రీడలు ఆడుతూ ఉంటే.. మీ తోటి స్నేహితులతో.. ఏలా ప్రవర్తించాలో అర్థమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడీ చరణ్ దాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, బీసీ కార్పోరేషన్ ఈడీ సరోజ, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇతర క్రీడాకారుల ప్రతినిధులు పాల్గొన్నారు
Previous Post Next Post