విజయవాడ, మార్చి 23 (way2newstv.com)
ఇళ్లన్నీ కలిసే ఉంటాయి.. కొత్తవారెవరైనా వచ్చి ఇది ఏ ఊరు? అనడిగితే వూత్రం ఒక్కొక్కరు ఒక్కో ఊరి పేరు చెబుతారు. అదే ఆ ప్రాంతం ప్రత్యేకత! ఇళ్లన్నీ ఒకే చోట ఉన్నా, రెండు జిల్లాలు, మూడు మండలాలకు చెందిన మూడు వేర్వేరు గ్రామాలవి. వినడానికి విచిత్రంగా ఉన్నా వాస్తవం ఇదే! కొల్లూరు మండలంలోని చిలుమూరులంక గ్రామం, కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామాలు కలిసే ఉంటాయి.ఈ రెండు గ్రామాలు గుంటూరు జిల్లావి కాగా, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఐలూరు శివారు గ్రామం అయిన కనిగిరిలంక కూడా ఈ రెండింటితో కలిసే ఉంటుంది. చిలుమూరులంక, అన్నవరపులంక గ్రామాలను పంచాయతీ రోడ్డు వేరుచేస్తుంది.
ఒకే వీధి... రెండు ఊర్లు
ఈ రెండు గ్రావూలను కలుపుతూ కొత్తూరులంక వెళ్లే తారురోడ్డుకు తూర్పునే ఉన్న ఇళ్లన్నీ కనిగిరిలంక గ్రామాం పరిధిలోనివి. గతంలో కొల్లిపర, కొల్లూరు మండలాలు దుగ్గిరాల నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండగా కనిగిరిలంక మాత్రం కృష్ణాజిల్లా ఉయ్యూరు నియోజకవర్గంలో ఉండేది.నియోజకవర్గాల పునర్విభజనతో దుగ్గిరాల నియోజకవర్గం రద్దయిన విషయం తెలిసిందే. కొల్లూరు మండలంలోని చిలుమూరులంక వేమూరు (ఎస్సీ) నియోజకవర్గంలో చేరింది. కొల్లిపర మండలానికి చెందిన అన్నవరపులంక తెనాలి నియోజకవర్గం పరిధిలోకి వెళ్లింది. కృష్ణాజిల్లాకు చెందిన కనిగిరిలంక అదే జిల్లాలోని పామార్రు (ఎస్సీ)నియోజకవర్గంలోకి వెళ్లింది. అందరూ దాదాపుగా ఒకే చోట ఉంటున్న మూడు గ్రామాల ఓటర్లు, మూడు వేర్వేరు నియోజకవర్గాల ఓటర్లు ఓట్లు వేయనున్నారు. మిగతా వసతులు ఎలా ఉన్నా ఆ గ్రావూలన్నింటికీ కొల్లూరు మండలం నుంచే రోడ్డు రవాణా సౌకర్యం ఉంది.