అంగన్వాడీ కేంద్రంలో త్రాచు పాము కలకలం

మంగళగిరి, మార్చి 1, (way2newstv.com)
మంగళగిరి మండలం లోని కృష్ణాయపాలెం దళితవాడ అంగన్వాడీ కేంద్రంలో ఒక త్రాచు పాము కలకలం సృష్టించింది.  పిల్లలతో పాటు అంగన్వాడీ కార్యకర్త, ఆయా భయంతో పరుగులు తీశారు. శుక్రవారం ఉదయం కేంద్రం తెరిచేటప్పటికే పాము లోపల ఉంది. అయితే ముందుగా దీనిని ఎవరూ గుర్తించ లేదు. కొద్ది సమయం అయిన తర్వాత పాము బుసలు వినిపించడంతో అనుమానంతో కార్యకర్త, ఆయాలు లోపల వెతికారు. త్రాచు పాము ఒక్కసారిగా బయటకు వచ్చింది.


అంగన్వాడీ కేంద్రంలో త్రాచు పాము కలకలం

ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వచ్చి పామును కర్రలతో కొట్టి చంపివేసారు. దీంతో కేంద్రంలోని పిల్లలు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా కేంద్రంకు ఆనుకొని ముళ్లతుప్పలు ఉండటమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు అంటున్నారు. పాము వల్ల ఒకవేళ ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యులని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది మేల్కొని అంగన్ వాడీ కేంద్రాల చుట్టూ ముళ్ల తుప్పలు, పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Previous Post Next Post