ప్రకాశం మార్చి 30, (way2newstv.com)
జిల్లాలో నెలకొన్న మంచినీటి ఎద్దడిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని పరిష్కరించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించటం తదితర అంశాలపై జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో చర్చ జరిగింది. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి కుడి, ఎడమ కాలువల నిర్మాణాలు పూర్తి చేసి రిజర్వాయర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, జిల్లాలో జరుగుతున్న దళిత తేజం - తెలుగుదేశం కార్యక్రమంపై చర్చించారు.
మంచి నీటి ఎద్దడి నివారణకు చర్యలు
యర్రగొండపాలెం నియోజక వర్గంలోని తీగలేరు, కోటకట్ల చెరువు ప్రాజెక్టు మంజూరు, ముఖ్యమంత్రి హామీ అయిన వెన్నా పాపిరెడ్డిచెరువు అభివృద్ధికి నిధులు మంజూరు విషయం, గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాలకు వెళ్లే దారులను, ఉపాధి హామీ పథకం నిధులు, శివారు గ్రామాల్లో వౌలిక వసతులు కల్పించే విషయంపై , శనగలు - కందుల కొనుగోళ్లను ఎఎంసిల ద్వారా కొనుగోలు చేయించే విషయం, ప్రకాశం జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటి, నిమ్జ్, దొనకొండ, ఇండస్ట్రీరియల్ కారిడార్,రామయపట్నం పోర్టు తదితర ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసే విషయంపై చర్చ జరిగింది