అనంతపురం, మార్చి 23 (way2newstv.com)
హిందూపురం లోక సభ నియోజక వర్గంనుంచి వైకాపా అభ్యర్థిగా గోరంట్ల సవిత పోటీ చేయనున్నారు. వైకాపా తరఫున పోటీ చేయాలనుకున్న గోరంట్ల మాధవ్ విఆర్ఎస్ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఫలితంగా ఆయన పోటీ చేసే అవకాశం కోల్పోయారు. దీనితో ఆయన భార్య సవితను పోటీలోకి దింపుతున్నారు. శనివారం ఉదయం మాధవ్ ఇక్కడి లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయ్యారు.
హిందూపురం వైకాపా అభ్యర్ధిగా గొరంట్ల సవిత
తన రాజీనామాను ఆమోదించకపోతే తన భార్యతో నామినేషన్ వేయిస్తానని ఈ సందర్భంగా జగన్ కు చెప్పారు. దీంతో, మాధవ్ భార్య సవితకు బీఫామ్ ఇవ్వాలంటూ పార్టీ నేతలకు జగన్ ఆదేశించారు. తన రాజీనామా లేఖను ఆమోదించమని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్, ఏపీ ఎన్నికల కమిషన్ ఆదేశించినా.. కర్నూలు డీఐజీ నాగేంద్ర కుమార్ రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వడంలేదని మాధవ్ ఆరోపించిన విషయం తెలిసిందే..