ఓల్డ్ ఎజ్ లుక్ లో శర్వానంద్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఓల్డ్ ఎజ్ లుక్ లో శర్వానంద్

హైద్రాబాద్, మార్చి 6 (way2newstv.com)
టాలీవుడ్ లో మినిమన్ గ్యారంటీ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఇటీవల ‘పడి పడి లేచె మనసు’ చిత్రంతో నిరాశ పరిచినా.. వరుస చిత్రాలతో బిజీగా మారారు. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రాన్ని చేస్తున్నారు.  శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెష్ అందిస్తూ శర్వానంద్ 27 మూవీ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. 

 
ఓల్డ్ ఎజ్ లుక్ లో శర్వానంద్ 

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ ఏజ్డ్ లుక్తో కలిపించి సర్ప్రైజ్ చేశారు. ఈ చిత్రంలో శర్వానంద్ యంగ్గా, మధ్యవయస్కుడిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్లుక్లో గుబురు గడ్డం, మీసాలతో స్టైలిష్ సూట్లో కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని డాన్లా సీరియస్ లుక్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ చిత్రంలో శర్వానంద్కి జోడీగా కాజల్, కళ్యాణి ప్రియదర్శిన్లు నటిస్తున్నారు. 
ఇక ఈ చిత్రంతో తమిళ  సెన్సేషన్ హిట్ మూవీ ‘96’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడీగా సమంత నటిస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి తమిళంలో తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమార్ రీమేక్కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘జానకీదేవి’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.