వివేకానందరెడ్డి హత్యకేసులో జగన్‌ ముఖ్య అనుచరుడి అరెస్ట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వివేకానందరెడ్డి హత్యకేసులో జగన్‌ ముఖ్య అనుచరుడి అరెస్ట్

పులివెందుల మార్చ్ 22 (way2newstv.com
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో జగన్‌ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్ననే కడప పార్లమెంట్‌ ఆర్జేడీ అభ్యర్థిగా శివశంకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇప్పటికే శివశంకర్‌రెడ్డిని పోలీసులు రెండు సార్లు విచారించారు. 


వివేకానందరెడ్డి హత్యకేసులో జగన్‌ ముఖ్య అనుచరుడి అరెస్ట్

పులివెందులకు చెందిన నాగప్ప, ఆయన కుమారుడు శివను కూడా పోలీసులు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడపలోని ఓ రహస్య స్థావరంలో 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే 40 మంది సాక్షులను పోలీసులు విచారించారు.కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీలు కోణంలో సిట్‌ విచారణ జరుపుతోంది. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వరెడ్డి, కిరాయి హంతకులు శేఖర్‌రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం లోపల కొందరు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.