గుంటూరు,మార్చి 19, (way2newstv.com)
కార్యకర్తల నిరసనల మధ్య వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లాలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకు మళ్లీ పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా చివరి నిమిషంలో పొన్నూరు నుంచి రావి వెంకటరమణను తప్పించి కిలారి రోశయ్యకు కేటాయించారు. జిల్లాలో పార్టీకి తొలి నుంచి గుంటూరు పశ్చిమకు సమన్వయకర్తగా వ్యవహరించిన లేళ్ళ అప్పిరెడ్డి, పెదకూర పాడుకు కావటి మనోహర్ నాయుడు, చిలకలూరి పేటకు మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, తాడి కొండకు కత్తెర క్రిస్టియానాలను ఇటీవలనే సమన్వయకర్తల బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. అయితే మధ్యలోనే వారికి మొండి చేయిచూ పటంతో వారు కాస్త సీటు విషయంలో మానసికంగా వెనక్కి తగ్గారు. అయితే పొన్నూరు సమన్యయ కర్తగా వ్యవహరిస్తూ ఎన్నికలకు సిద్ధమ వుతున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణను ఆఖరి క్షణంలో తొలగించి కిలారి రోశయ్యకు ఆ సీటును కేటాయించటంతో రావి వర్గీయులు తీవ్ర ఆగ్రహా వేశాలు వ్యక్తం చేస్తున్నారు.ముందుగానే సీటు మార్పు విషయం తెలుసుకున్న రావి వర్గీయులు భగ్గుమన్నారు.
పార్టీల్లో భగ్గుమంటున్న అసమ్మతి
గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం విది తమే.రావి వర్గీయుల ఆగ్రహంతో మోదు గుల కార్యాలయంలో అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. చివరకు అభ్యర్థు జాబితాలో పొన్నూరు స్థానానికి కిలారి రోశయ్యని ప్రకటించటం, గుంటూరు ఎంపీగా మోదుగులను ప్రకటించటంతో రావి వర్గీయులను మరింత ఆగ్రహావేశా లకు గురిచేస్తోంది. రావి వెంకటరమణకు పొన్నూరుతోపాటు ప్రత్తిపాడు నియోజక వర్గంలో వర్గీయులున్నారు. 2004 ఎన్నిక ల్లో రావి వెంకటరమణ కాంగ్రెస్ తరపున ప్రత్తిపాడు నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రావి మార్పు తో ఆ రెండు స్థానాల్లోనూ వైసీపీకి ఇబ్బం దేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రావి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొన్నూరు, ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థుల ను ఓడిస్తామని శపథం చేస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎండీ ముస్తఫా (గుంటూరు తూర్పు), డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నరసరావుపేట), ఆళ్ళ రామకృష్ణారెడ్డి (మంగళగిరి), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), కోన రఘుపతి (బాపట్ల)లకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల నుంచి మరోసారి పోటీకి అవకాశం ఇచ్చారు.ఎంపీ స్థానాలూ ఖరారు.. వైసీపీ ప్రకటించిన 9 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో బాపట్ల ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి తుళ్ళూరు మండలం ఉద్దండరాయపాలే నికి చెందిన నందిగం సురేష్‌ను ప్రకటిం చారు. తర్వాత ప్రకటించిన జాబితాలో గుంటూరు ఎంపీ స్థానానికి మోదుగుల వేణుగోపాలరెడ్డి, నరసరావుపేట లోక్‌సభ స్థానానికి విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయులు అభ్యర్థి త్వాలను ఖరారు చేశారు. బాపట్లలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు కోన పోవాలి... జగన్ రావాలంటూ కార్యకర్తలు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్‌ను ఖరారు చేయటంతో స్థానికేతరుడికి సీటు ఎలా ఇస్తారంటూ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.