ఎన్నికల విధులను చిత్తశుద్దితో నిర్వర్తించండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల విధులను చిత్తశుద్దితో నిర్వర్తించండి

 కర్నూలు, మార్చి 29 (way2newstv.com)
ఎన్నికల విధులను చిత్తశుద్దితో నిర్వర్తించాలని కర్నూలు పార్లమెంటరి నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ రూపక్ కె.ఆర్.మజుందర్ అధికారులను ఉద్దేశించి అన్నారు. శుక్రవారం కల్లెక్టరేట్ నుంచి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్వోలు, ఎఆర్వోలు, నోడల్ అధికారులు, సెక్తోరాల్ అధికారులు, స్టాటిక్ సేర్వేవలెన్స్, ఎం.సి.సి., పోలీస్, ఎక్సేపెండిచర్ తదితర బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, పోలీస్ అబ్జర్వర్ అతుల్ వర్మ, కర్నూలు, కోడుమూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ శ్రీకాంత్ శాస్త్రి, నంద్యాల పార్లమెంటరి నియోజక వర్గ జనరల్ అబ్జర్వర్ వినీత్ కుమార్, బనగానపల్లె, డోన్ నియోజకవర్గాల వ్యయ పరీశీలకులు దృబజ్యోతిరే, నంద్యాల పార్లమెంటరి నియోజకవర్గం వ్యయ పరిశీలకులు సునీల్ బివేర్, జేసి పట్టాన్ సెట్టి రవి సుభాష్,  నగర పాలక కమిషనర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ రూపక్ కె.ఆర్.మజుందర్ మాట్లాడుతూ ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది అందరు చిత్తశుద్దితో పని చేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా, శాంతి యుతంగా జరిగేలా కృషి చేయాలన్నారు. 



ఎన్నికల విధులను చిత్తశుద్దితో నిర్వర్తించండి

ఓటు కలిగిన ప్రతి ఓటరు స్వేచగా తమ ఓటును వినియోగించుకునేలా అవగాహన పెంపొందించాలన్నారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగాలన్నారు. భారతదేశంలో ఏకకాలంలో జరుపుకునే ఓటింగ్ ప్రక్రియ అతిపెద్ద పండుగ అని అన్నారు. స్టాటిక్ సేర్వేవలెన్స్, ఎక్సేపెండిచర్, ఎం.సి.సి., ఎం.సి.ఎం.సి, ఎక్ష్సైజు తదితర బృందాలకు నిర్దేశించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఒకటికన్నా ఎక్కువ బ్యాలెట్ యూనిట్ల అవసరమున్నా నియోజకవర్గాల్లో మరోసారి శిక్షణ ఇప్పించాలన్నారు. ఉ.6గంటల నుండి 7గంటలలోపు మాక్ పోలింగ్ ప్రక్రియను పూర్తిచేయలని తెలిపారు. లౌడ్ స్పీకర్, బహిరంగ సభలు తదితర అవసరమైన వాటికి అనుమతులను నిర్దేశించిన సూత్రాల మేరకు అనుమతిని ఇవ్వాలన్నారు. దివ్యాంగ ఓటర్లకు సహాయకారులుగా వాలంటీర్లను ఎర్పాటు చేసుకోవాలన్నారు. 
పోలీస్ అబ్జర్వర్ అతుల్ వర్మ  మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులందు నిఘా పెంచాలన్నారు. ఎటువంటి రసీదులు లేని అక్రమ నగదు, గోల్డ్, మద్యం, ఆయుదాలను సీజ్ చేసి ఎప్పటికప్పుడు నివేదికను పంపాలన్నారు. అరాచక చక్తులు జిల్లా లోపలి రాకుండా 24గంటలు దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ముఖ్యంగా రాత్రి 2గంటల నుండి ఉదయం 6గంటల వరకు మరింత సునిసిత దృష్టిని కేంద్రికరించాలన్నారు. 
నంద్యాల పార్లమెంటరి నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ వినీత్ కుమార్ మాట్లాడుతూ నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసిందని మిగిలిన పోలింగ్ ఘట్టాన్ని అంతే ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలన్నారు. స్వేచాయుత వాతావరణంలో ప్రతి ఓటరు తన ఓటును వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటింగ్ పండుగా 5సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగని ఈ పండుగలో ప్రతి ఓటరు ఓటు వేసి ఓటింగ్ శాతం పెరిగేల చర్యలు చేపట్టాలన్నారు. 
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేది లోపు ఓటరు స్లిప్పుల పంపిణి పూర్తీ చేయాలన్నారు. రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించే నియోజకవర్గపు ఆర్వోలు తమ పోలింగ్ సిబ్బందికి మరోసారి శిక్షణనిచ్చ అవగాహన పెంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 31 ఆదివారం పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలల్లో శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్కోవాలన్నారు.పోలింగ్ ప్రక్రియకు చేపట్టనున్న చర్యలపై కర్నూలు, ఆళ్లగడ్డ ఆర్వోలు అబ్జర్వర్ల ఆదేశం మేరకు వివరించారు. 
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశం, డిఆర్డిఎ పిడి రామ కృష్ణ, పరిశ్రమల శాఖ జిఎం సోమ శేఖర రెడ్డి, డిసిఓ సుబ్బారావు, ఎంప్లాయిమెంట్ అధికారి మధు భూషణ్ తదితరులు పాల్గొన్నారు.