రెచ్చిపోతున్న ఇసుక మాఫియా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

నల్లగొండ, మార్చి 28, (way2newstv.com)
గిరిజన సొసైటీలకు అప్పగించిన ఇసుక కాంట్రాక్టులను దొడ్డి దారిలో ఇసుక మాఫియా చేజిక్కించుకున్నది. ఖనిజాభివృద్ది సంస్థ గిరిజన సొసైటీలకు చేసిన ఒప్పందాన్ని ఎవరికీ బదలయించరాదనే నిబంధన ఉన్నప్పటికీ ఈ నిబంధనను కొందరు ఉన్నతాధికారులే ఖాతరు చేయలేదు. సహకార సంఘాల వద్ద నుంచి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు అనిదికారిన ఒప్పందాలు చేయించారు. అంతే కాకుండా సహకార స్ఫూర్తికి విఘాతం కల్పించారు. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు సహకార సంఘాల అధికారాలను తమ గుప్పెట్లో పెట్టుకుని ఆ సంఘాల పేరుతో కొన్ని బ్యాంకు ఖాతాలను తెరిచారు. సహకార సంఘాల పేరుతో వచ్చిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు చెల్లించారు. టెండర్‌ ప్రక్రియ కానీ, కొటేషన్లు కానీ, బిల్లులు కానీ లేకుండానే ఉన్నతాధికారులు స్వయంగా చేసిన చెల్లిం పులు వివాదాస్పదమయ్యాయి. 


రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

ఇసుక తవ్వకాలు చేసిన సహకార సంఘాలకు క్యూబిక్‌ మీటర్‌కు కేవలం 40 రూపా యలే చెల్లించి కాంట్రాక్టర్లకు రూ. 180 చెల్లించటం వెనుక అవినీతే ప్రధాన కారణమని తెలుస్తున్నది. గత నాలు గేండ్లుగా జరుగుతున్న ఈ అక్రమాల వెనుక ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల హస్తం ఉండటంతో విజెలెన్స్‌ దర్యాప్తు ముందుకు కొనసాగకుండా ఒత్తిడులు వస్తున్నట్టు తెలిసింది. ఏటూరునాగారం, భద్రాచలం ఐటడీఏల ప్రస్తుత ప్రాజెక్టు అధికారులతో పాటూ గతంలో పనిచేసిన అధికారులపై కూడా దర్యాప్తు జరుగుతున్నది. వీరిలో ఇద్దరు ఐఏఎస్‌లు కూడా ఉన్నారని తెలుస్తున్నది. ఏజెన్సీ ప్రాంతంలో భూమి బదలయింపు నిషేధిత చట్టం 1/59, 1/70, పీసా చట్టం అమల్లో ఉన్నాయి. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలులో ఉన్న ఈ ప్రాంతంలో గిరిజనేతరులకు మైనింగ్‌ కాంట్రాక్టులు అప్పగించవద్దని సమతా కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నిబంధన లకు విరుద్ధంగా కొందరు అధికారులు వ్యవహరించారంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌కు ఫిర్యాదులు అందాయి. సహకార సంఘాల వ్యవహారాల్లో అధికారులు జోక్యం చేసుకో రాదంటూ గతంలో రాష్ట్ర హైకోర్టు పలు తీర్పుల్లో పేర్కొ న్నది. 1995 మాక్స్‌ సహకార చట్టం ప్రకారం సహకార సంఘాలకు పూర్తి ప్రతిపత్తిని కల్పించారు. ఈ చట్టం ప్రకా రమే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన మహిళా ఇసుక సొపైటీలు నమోదయి ఉన్నాయి. అయినప్పటికీ అధికారుల జోక్యంతో కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు.