లక్నో, మార్చి 12, (way2newstv.com)
కాంగ్రెస్‌తో ఏ రాష్ట్రంలోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి. ఈ ప్రకటనతో యూపీలో మహాకూటమి ప్రతిపాదనకు దారులు మూసేశారు. బీఎస్పీ నేతలతో మంగళవారం ఉదయం సమావేశమైన మాయావతి.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే యూపీలో బీజేపీని ఓడించడానికి తమ మధ్య ఉన్న వైరాన్ని పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ తో పొత్తులు ఉండవు
అయితే ఈ కూటమిలో కాంగ్రెస్ ఎంట్రీని మాత్రం మాయావతి తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్నది ఆమె వాదన. ఆ పార్టీ నుంచి తమకు ఓట్ల బదిలీ జరగలేదని మాయా చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమకు కలిగే లబ్ధి లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం బెడసికొట్టడంతో ఆ పార్టీని మరింత దూరం పెట్టారు మాయావతి.