గులాబీ గూటికి హరిప్రియ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గులాబీ గూటికి హరిప్రియ

తెరాసలో చేరనున్నట్లు లేఖ విడుదల
ఖమ్మం, మా ర్చి11 (way2newstv.com
కాంగ్రెస్ కు   దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి వలసలు ఆగడంలేదు. వివిధ పార్టీల నుంచి గెలుపొందిన వారు ఒక్కొక్కరుగా గులాబీ గూటికి చేరుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార పార్టీలోకి వెళ్లనున్నట్లు ప్రకటించాగా తాజాగా ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కూడా తెరాసలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికైన అతిపిన్న వయసులో కలిగిన ఎమ్మెల్యేగా హరిప్రియ రికార్డు సృష్టించిన విషయం  విధితమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయిదు శాసన సభా స్థానాలు ఉండగా ఇల్లెందు, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం అసెంబ్లీలో కాంగ్రెస్, అశ్వారావుపేటలో తెదేపా ప్రజాకూటమి తరపున విజయం సాధించాయి. ప్రజాకూటమి జిల్లాలో క్లీన్స్వీప్ చేయగా అధికార పార్టీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం సీన్ రివర్స్ అవుతోంది. 


గులాబీ గూటికి హరిప్రియ

ఇటీవలే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ను వీడి తెరాసలో చేరుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా హరిప్రియ కూడా బహిరంగ లేఖ విడుదల చేయడం విశేషం. జిల్లాలో కాంగ్రెస్ను నుంచి గెలిచిన  నలుగురిలో ఇద్దరు తెరాసలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరువురు ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ అభివృద్ధి, గిరిజనులకు మేలు చేయాలన్న భావనతోనే పార్టీ మారుతున్నట్లు లేఖల్లో వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరబోతున్నారన్న సమాచారం కాంగ్రెస్ పార్టీని కంగుతినిపిస్తోంది. వలసలు ఇంతటితో ఆగుతాయా? ఇంకా ఉంటాయా? అని ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతుండడం విశేషం.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లాలో 5 శాసన సభా స్థానాలు ఉండగా తెరాస ఖమ్మంలో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన లావుడ్యా రాములునాయక్ డిసెంబరు మూడో వారంతో తెరాసలో చేరారు. సత్తుపల్లి నుంచి తెదేపా అభ్యర్థిగా గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య కూడా తెరాసలో చేరనున్నట్లు ప్రకటించారు. ఉభయ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. తెరాసలో ఖమ్మం, వైరా ఎమ్మెల్యేలు ఇద్దరు ఉండగా.. మరో ఇద్దరు పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు వీలుగా బహిరంగ లేఖలు విడుదల చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే కూడా అదే బాటలో ఉన్నారు. దీనికితోడు మరో ఎమ్మెల్యే కూడా తెరాసలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.