తీవ్ర నిర్లక్ష్యానికి వలస పక్షులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తీవ్ర నిర్లక్ష్యానికి వలస పక్షులు

ఏలూరు, మార్చి 23  (way2newstv.com)
కొల్లేరులోని వలస పక్షుల కేంద్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. సందర్శకులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెంచేందుకు ఏటేటా నిర్వహిస్తామని చెప్పిన ఫెస్టివల్‌ ఈ ఏడాది నిర్వహించలేదు. ఈ కేంద్రంలో కనీస సౌకర్యాలు మగ్యమవ్వడంతో సందర్శకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కష్ణాజిల్లా కైకలూరు మండలం ఆటపాక వద్ద కొల్లేరు ప్రాంతం పక్షుల విడిది కేంద్రం. సైబీరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, సౌత్‌ ఆఫ్రికా నుండీ విదేశీ పక్షులు వాటికి అవసరమైన ఆహారంఅందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతానికి వలస వస్తాయి. ఏటేటా అక్టోబర్‌ నుండి మార్చి చివరి వరకు ఆరు నెలలు ఇక్కడ నివశిస్తాయి. ఈ కాలంలో వీటిని తిలకించేందుకు రోజుకు సగటున 1000 మందికిపైగా పర్యాటకులు వస్తారు. ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు గతేడాది ఫిబ్రవరి నాలుగో తేదీన ఎపి పర్యాటక శాఖ రూ. 5 కోట్లు వెచ్చించి భారీ ఎత్తున పెలికాన్‌ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు అవసరమైన తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు.


 తీవ్ర నిర్లక్ష్యానికి వలస పక్షులు

సమీపంలోని బడ్డీ కొట్లలో వాటర్‌ ప్యాకెట్లు కొని దాహార్తి తీర్చుకోవాల్సిన పరిస్థితి. ఏటేటా ఫెలికాన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఈ ఏడాది ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.290 ఎకరాల విస్తీర్ణంలో ఉండే చెరువులో విదేశీ వలస పక్షులు నివసించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పక్షులు ఉదయం 9 గంటల తరువాత ఆహారానికి వెళ్లి సాయంత్రం 4.30 తరువాత మాత్రమే తిరిగి వస్తాయి. వీటిని సందర్శించేందుకు సాధారణ రోజుల్లో రోజుకు సగటున 1000 మంది, వారాంతాలు, సెలవు రోజుల్లో రోజుకు 2 వేల మంది వరకు వస్తారు. పక్షులు అక్కడ ఉండే వేళల్లో మాత్రమే సందర్శకులు బోట్లలో వెళ్లి చూసి రావాలి. ఇక్కడ 3 బోట్లు మాత్రమే ఉన్నాయి. అదీ ఒక్కొ బోటులో 20 మందికి మించి వెళ్లే అవకాశం ఉండదు. అంటే మూడ బోట్లలోనూ ఒక్కొ ట్రిప్పుకు 60 మంది మాత్రమే వెళ్లి రాగలరు. సగటున రోజుకు ఒక్కొ బోటు 5 ట్రిప్పులు ఏర్పాటు చేసినా 300 మందికి మించి అవకాశం ఉండటం లేదు. గతేడాది నిర్వహించిన పెలికాన్‌ పెస్టివల్‌లో మరో 2 అదనపు బోట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి అందుబాటులోకి రాలేదు. ఇక్కడ పర్యాటక అవసరాలకు రిసార్ట్సు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ దిశగా ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా రోడ్లకు ఇరువైపులా గ్రీనరీ చూద్దామన్నా కనిపించదు.