పోమ్మన లేక పొగబెడుతున్నారా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోమ్మన లేక పొగబెడుతున్నారా

నెల్లూరు, మార్చి 7,(way2newstv.com)
టీడీపీలో టిక్కెట్లు రాని వారంతా వైసీపీ వైపు చూస్తున్నారు. వారందర్నీ పిలిచి మరీ కండువా కప్పుతున్నారు జగన్. ఆ నాయకలతో పార్టీకి ఏమైనా లాభమా అంటే అంచనా వేయలేని పరిస్థితి. అమలాపురం ఎంపి రవీంద్ర బాబు టీడీపీ నుండి వైసిపిలో చేరిపోయారు. ఆయనకు టీడీపీలో సీటు ఇచ్చే అవకాశమే లేదని ముందుగానే తేల్చి చెప్పారు. ఫలితంగా రవీంద్రబాబు వైసీపీలో చేరిపోయారు. అయితే ఆయన ప్రజాబలం జగన్‌ను కూడా అబ్బురపరిచిందని, టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే వైసీపీలో ప్రచారం ప్రారంభమయింది. తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మొదుగుల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతానని ప్రకటించారు. ఆయన పార్టీ నుంచి ఎప్పుడు పోతారా అని టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు.


పోమ్మన లేక పొగబెడుతున్నారా

అనకాపల్లి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పార్టీలో చేరేందుకు నాలుగు రోజులు ముందు కూడా చంద్రబాబును ఆకాశానికి ఎత్తి జగన్ ను బూతులు తిట్టారని అతన్ని ప్రజలు ఎలా నమ్ముతారని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు భీమిలిలో ఎక్కడా ప్రజాదరణ దక్కడం లేదని సోషల్ మీడియాలో వీడియోల సాక్ష్యంగా తేలిపోతోంది. అదే సమయంలో టీడీపీలో చేరుతున్న నేతలు మాత్రం బలంగా కనిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరడంతో కర్నూలు పార్లమెంటుతో పాటు మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆ ప్రభావం ఉంటుంది. ఉగ్రనరసింహరెడ్డి చేరికతో కనిగిరిలో టీడీపీకి అడ్వాంటేజ్ వచ్చినట్లే. కాకినాడకు చెందిన చెలమలశెట్టి సునీల్, చేరబోతున్న కొణతాల రామక్రిష్ణ, కర్నూలుకు చెందిన గౌరు దంపతులు, సబ్బంహరి లాంటి నేతలు ప్రజల్లో పట్టున్న నేతలు.రాజకీయంగా పేరుప్రతిష్టలున్న కుటుంబాలనుండి వచ్చిన వారు తెలుగుదేశంలో చేరుతున్నారు. పెద్దగా ప్రజాబలం లేదని టిక్కెట్ రాదన్న వారు వైసీపీలో చేరిపోతున్నారు. ఈ చేరికల ద్వారానే ప్రజల సెంటిమెంట్ ఏమిటో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.