బోయింగ్‌ విమానాలను నిషేదించిన చైనా! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బోయింగ్‌ విమానాలను నిషేదించిన చైనా!

బీజింగ్‌ మార్చ్ 11 (way2newstv.com)
చైనా నుంచి నిర్వహిస్తున్న అన్ని వైమానిక సంస్థలు బోయింగ్‌ 737 మాక్స్‌ 8 రకం విమానాల వినియోగాన్ని సోమవారం ఉదయం నుంచి నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో చైనా విమానయాన సంస్థల వద్ద ఉన్న 96 బోయింగ్‌ విమానాలు ఇప్పుడు ఎగరడంలేదు.  ఐదునెలల స్వల్ప వ్యవధిలోనే రెండు సరికొత్త 737 మాక్స్‌8 రకం విమానాలు ప్రమాదానికి గురికావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. చైనా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ విషయాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి తొమ్మిది గంటలలోపు చైనా విమానయాన సంస్థలు మొత్తం తమ 737లను నేలపైకి దించేయాల్సి ఉంటుంది. 


బోయింగ్‌ విమానాలను నిషేదించిన చైనా! 

మరోపక్క చైనా విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టి పర్యవేక్షించే అసెట్‌ సూపర్‌ విజన్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషన్‌ కూడా దీనికి అనుకూలంగానే స్పందించింది. ఇప్పటికే తమ 96 విమానాలను నేలపైకి దింపేశామని సోషల్‌మీడియా వైబోలో పేర్కొంది. ఆ తర్వాత ఆ పోస్టును తొలగించింది. దించేసిన విమానాల స్థానంలో బోయింగ్‌ 737-800ఎస్‌ రకం విమానాలను సర్వీసులోకి తీసుకొంది. బోయింగ్‌కు చైనా ఎయిర్‌లైన్స్‌ అతిపెద్ద వినియోగదారు. కొత్త విమానాలను అత్యధికంగా ఆర్డర్‌ ఇచ్చి డెలివరీ తీసుకొంది కూడా చైనానే. మరోపక్క చైనా సొంతంగా సీ919 అనే వాణిజ్య విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. దీనిని బోయింగ్‌ 737కు ప్రత్యామ్నాయంగా చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. సీ919 ప్రయోగాత్మక పరీక్షలు కూడా మొదలయ్యాయి. అంతేకాదు దీనికి చైనీస్‌ కంపెనీల నుంచి భారీగా ఆర్డర్లు కూడా వచ్చాయి. కాకపోతే ఈ విమానం ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుందని తేలింది. మరోపక్క ఇథియోపియా కూడా బోయింగ్‌ 737 మాక్స్‌ రకం విమానాల వాడకాన్ని నిలిపివేసింది.