పెద్దమందడిలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పెద్దమందడిలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన

హైదరాబాద్, మార్చ్ 5 (way2newstv.com
పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే విద్య, వైద్యాన్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ ,సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం లోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా ఆయన వెల్టూరు గ్రామంలో కోటి అరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఒక్కొక్కటి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సగర, వడ్డెర కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. బలిజ పల్లి గ్రామంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యువజన భవనానికి, జంగమయ్యపల్లి గ్రామంలో ఒక్కొక్కటి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాయి బ్రాహ్మణ, గౌడ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


 పెద్దమందడిలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన

ఈ సందర్భంగా వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సాగునీటి పారుదల, రైతుల సంక్షేమంకోసం కృషి చేస్తూనే మరోవైపు విద్య, వైద్యంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ ఖర్చుతోనే పేద ప్రజలకు విద్య ,వైద్యం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి ప్రత్యేక మంజూరు తీసుకురావడం జరిగిందని, ఈ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారు ను కోరారు. జాతీయ రహదారిపై ప్రమాదాల దృష్ట్యా వెల్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చాలా అవసరమని, అన్నారు.
వచ్చే వర్షాకాలం నాటికి వెల్టూర్ గ్రామానికి కృష్ణ నీళ్లను ఇచ్చి తీరుతామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఖానాయ పల్లి కాలువ నుండి వెల్టూర్ కు సాగునీరందించే ఫైలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం కోసం వేచి ఉందని, ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత ఈ వేసవి కాలంలోనే పనులు పూర్తిచేసి వచ్చే వర్షాకాలం నాటికి సాగునీరు అందించేలా కృషి చేస్తానని అన్నారు. పెద్దమందడి, ఘన్పూర్ మండలాలకు శాశ్వతంగా సాగునీరు అందించేందుకు గాను గట్ల ఖానాపూర్ గుట్టల్లో రిజర్వాయర్ను ప్రతిపాదించడం జరిగిందని, ఒకసారి ఈ రిజర్వాయర్ న నీటితో నింపితే మూడు నాలుగు సంవత్సరాల వరకు సాగునీరు అందించేందుకు అవకాశముంటుందని అన్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువుల కోసం ప్రాధాన్యతనిస్తున్నా దని, ముఖ్యంగా గురుకులాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా విద్యుత్ లో ఎలాంటి ఇబ్బందులు లేవని, అలాగే మిషన్ భగీరథ ద్వారా తాగునీటికి సమస్య లేదని, త్వరలోనే 2016 రూపాయల కు పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి తెలిపారు. కొత్త గ్రామపంచాయతీ చట్టం ప్రకారం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, ఎవరి గ్రామాలు వారు శుభ్రంగా ఉంచుకోవాలని తలంపు ప్రజల్లో రావాలని, ప్రజలందరూ సంఘటితంగా ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం అధికారి రవి శంకర్,ఆర్డీవో కే చంద్ర రెడ్డి తాసిల్దార్ గాన్షీరామ్, ఎంపీడీవో సాయి బృంద తదితరులు పాల్గొన్నారు