వ్యాక్స్ మహేష్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వ్యాక్స్ మహేష్...

హైద్రాబాద్, మార్చి 25, (way2newstv.com)
మహేష్‌‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం రూపొందించిన మహేష్‌బాబు మైనపు బొమ్మను సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఏర్పాటుచేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో మహేష్‌బాబు తన చేతులమీదుగా మైనపు బొమ్మను ఆవిష్కరించారు. 

వ్యాక్స్ మహేష్...

నలుపు రంగు షూట్‌‌తో ఉన్న ఈ మైనపు విగ్రహం అచ్చుగుద్దినట్లు మహేష్‌బాబు మాదిరిగానే ఉంది. ఒక చేతిని జేబులో పెట్టుకుని, మరో చేతిని గడ్డం కింద పెట్టి నిలుచున్నట్లు ఈ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహేష్‌బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితార పాల్గొన్నారు. అలాగే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం సింగపూర్‌కు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ మైనపు బొమ్మను ఒక రోజుపాటు ప్రదర్శన కోసం ఉంచి, అనంతరం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు.