రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి

నల్గోండ, మార్చి 5, (way2newstv.com)
నల్గోండ జిల్లా నార్కట్ పల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో  యాదాద్రి భువనగిరి జిల్లా  భూదాన్ పోచంపల్లి ఎస్సై మధుసూదన్ రెడ్డి  (35) మృతి చెందారు. మంగళవారం  తెల్లవారుజామున అయన నల్గొండ జరుగుతున్న కానిస్టేబుల్ ఈవెంట్స్ లో భాగంగా బందోబస్తూ నల్గొండ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  

 
రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి

మార్గమధ్యంలో ఎల్లారెడ్డిగూడెం దాటిన తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ సమీపంలో సుమారు 05:30గంటలకు   వాహనం అదుపు తప్పి రోడ్డు వెంట గల కంపచెట్ల లో బోల్తా కొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు  మధుసూధన్ రెడ్డిని నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతుడిది తిప్పర్తి మండలంలోని అయన కు ఇద్దరు పిల్లన్నారు.