వరంగల్ అర్బన్, మార్చి21 (way2newstv.com):
ఈ నెల 22 న ఉదయం 8గం నుండి సాయత్రం 4 గం వరకు శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు చెందిన పట్టభద్రులు, ఉపాద్యాయులు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాద్యాయ, పట్లభద్రుల నియోజకవర్గాలకు నిర్వహించే ఎన్నికల పోలింగ్ లో ఓటు వేస్తారని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తింపు కార్డులలో ఏదైన ఒకదానిని తీసుకొని పోలింగ్ కు వెళ్లాలని ఓటర్లకు సూచించారు.
ఎమ్మెల్పీ ఎన్నికకు అంతా సిద్దం
అలాగే, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నిర్వహించే ఎన్నికలకై జిల్లా లో 10 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అభ్యర్ధులు ఇకనుండి ప్రచారం చేయరాదని స్పఫ్టం చేశారు. ఎలక్రానిక్ మీడియాలలో పబ్లిసిటి చేయరాదని తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు తెలిపారు. ఈ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు పోలింగ్ పర్సనల్ తో పాటు మైక్రో అబ్జర్వర్లు, వీడియో గ్రాఫర్లు, వెబ్ కాస్టింగ్ వాలంటీర్లు , సెక్టార్ అధికారులను, రూట్ ఆఫీసర్లను నియమించినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు. శాసనమండలి ఎన్నికలకు జిల్లా రెవెన్యూ అధఙకారి పి.మోహన్ లాల్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కమలాపూర్ మండలాల్లోని ఎన్నికల నిర్వహణను వరంగల్ ఆర్డిఓ కె.వెంకారెడ్డి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.