మహిళా సాధికారతకు కాంగ్రెస్ కృషి

హైదరాబాద్, మార్చి 08 (way2newstv.com
రాబోయే రోజుల్లో మహిళను పాలనలో సమాన భాగస్వామ్యం చేయాలని ప్రతిఒక్కరూ ప్రతిన బునాలి. మహిళల సాధికారతకు  కు కాంగ్రెస్ ఎప్పుడు కృషి చేస్తోంది. కాంగ్రెస్ ద్వారానే మహిళలకు సమాన హక్కు సాధ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని అయన మహిళా కాంగ్రెస్ సదస్సులో మాట్లాడారు. స్త్రీకి పాలించే అవకాశం వస్తే ఎంతో సమర్థవంతంగా పాలన సాగించగలరు . దానికి ఇందిరాగాంధీనే ప్రత్యేక నిదర్శనం . 


మహిళా సాధికారతకు కాంగ్రెస్ కృషి

కాంగ్రెస్ కు నాయకత్వం వహించిన సోనియాగాంధీ.  త్యాగానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. ద్వాక్రా గ్రూప్స్ ద్వారా దేశంలో మహిళలను ఆర్థిక పరిపుష్టికి ఇచ్చింది కాంగ్రెస్. మోడీ పాలనలో ద్వాక్రా సంఘాలు కనుమారుగైయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన మంత్రి పదవులు ఇచ్చాయి. కానీ కేసీఆర్ పాలనలో మహిళలకు మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో మహిళల సమస్యలపై అసెంబ్లీలో సీఎల్పీ పక్షాన వాయిస్ వినిపిస్తాం. రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా వారికి అండగా మహిళా కాంగ్రెస్ జెండా నిలబడాలని అయన అన్నారు.
Previous Post Next Post