కేసీఆర్..మీ భిక్ష మాకొద్దు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్..మీ భిక్ష మాకొద్దు

కర్నూలు, మార్చి 28 (way2newstv.com)
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ డెవలప్‌మెంట్ చూసి ఓర్వలేకపోతున్న ఆయన.. జగన్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల ఆస్తులను కొట్టేసిన కేసీఆర్.. అమరావతి నిర్మాణానికి రూ.500కోట్లు ఇద్దామనుకున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘అమరావతికి శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్ రూ.500కోట్లు ఇద్దామని అనుకున్నారట. ప్రధాని మోదీ ఏమీ ఇవ్వకపోవడంతో తాను కూడా ఇవ్వకుండానే వెళ్లిపోయారట. కేసీఆర్.. నీ భిక్ష మాకొద్దు. కావాలంటే నేనే నీకు రూ.500కోట్లిస్తా’ అంటూ చంద్రబాబు విమర్శించారు. మోదీ, కేసీఆర్ పంపించిన సొమ్మును వైఎస్ జగన్ నియోజకవర్గానికి రూ.10కోట్ల చొప్పున పంపిణీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అవినీతి సొమ్ముతో అధికారంలోకి రావాలన్నదే జగన్ ధ్యేయమని మండిపడ్డారు. గన్ కోర్టుకు వెళ్లినా, ట్రైబ్యునల్ కు వెళ్లినా తాను భయపడలేదని చంద్రబాబు అన్నారు. ‘ఐదేళ్ల పాటు ప్రాజెక్టుల పక్కన, కాలువల పక్కనే పడుకున్నా.


కేసీఆర్..మీ భిక్ష మాకొద్దు

కేసుల విషయంలో అప్రమత్తంగా ఉన్నా. పుట్టపర్తికి చెందిన ఒకే ఒక రైతు నన్ను సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాడు తమ్మూళ్లూ.. అది నాకు ఇప్పటివరకూ జ్ఞాపకం ఉంది. ఎందుకూ పనికిరాని భూమికి నీళ్లు తీసుకొస్తే నాకు అడ్డుపడ్డారు’ అని విమర్శించారు. అన్నికష్టాలు ఎదురైనా బెదరకుండా రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచుతామనీ, ఉద్యానవన పంటకు కేంద్రంగా మారుస్తామని అన్నారు.ఒకప్పుడు అనంతపురం అంటే కరవు జిల్లా అనీ, ఇప్పుడు ఆనందమయమైన జిల్లా అనీ, ఆనందనగరి అని వ్యాఖ్యానించారు. నదుల అనుసంధానం చేసి అనంతపురం చరిత్రను పూర్తిగా మారుస్తామని స్పష్టంచేశారు. త్వరలోనే క్షత్రియులు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ సామాజికవర్గాల్లోని నిరుపేదలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీలో టీడీపీని దెబ్బతీయాలని ప్రధాని మోదీ కుట్ర చేశారని ఆరోపించారు. మోదీపై తాను సమర్థవంతంగా పోరాడుతాననీ, దానికి ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. కేసీఆర్ పని ఏపీ ఆస్తులను కొట్టేయడమేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను కొట్టేసి కట్టుబట్టలతో పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమరావతి శంకుస్థాపన రోజున రూ.500 కోట్లు ఇవ్వాలనుకున్నా. కానీ మోదీ బాధపడతాడు అని ఇవ్వలేదు’ అని కేసీఆర్ చెప్పాడన్నారు. రూ.లక్ష కోట్లు కొట్టేసి, ఏపీకి రావాల్సిన ఆస్తులను ఇవ్వని కేసీఆర్ రూ.500 కోట్లు భిక్షం వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు