సెన్సార్‌కి సిద్ధ‌మ‌వుతున్న `హ‌ల్‌ చ‌ల్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సెన్సార్‌కి సిద్ధ‌మ‌వుతున్న `హ‌ల్‌ చ‌ల్‌

శ్రీ రాఘ‌వేంద్ర ఆర్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై రుద్రాక్ష్‌, ధ‌న్య బాల‌కృష్ణ న‌టీనటులుగా తెర‌కెక్కిన చిత్రం `హ‌ల్‌చ‌ల్‌`. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి  చేసుకుని సెన్సార్‌కి సిద్ధ‌మ‌వుతుంది.ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత గ‌ణేష్ కొల్లురి మాట్లాడుతూ - `` క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతున్న మా `హ‌ల్ చ‌ల్` చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా తీర్చిదిద్దాం. సినిమా సెన్సార్‌కి సిద్ధ‌మైంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి.


సెన్సార్‌కి సిద్ధ‌మ‌వుతున్న `హ‌ల్‌ చ‌ల్‌

రుద్రాక్‌, ధన్య బాల‌కృష్ణ చ‌క్క‌గా యాక్ట్ చేశారు. మా బ్యాన‌ర్‌కు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంద‌నే న‌మ్మ‌కముంది. మంచి టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేశారు. ద‌ర్శ‌కుడు శ్రీపతి అనుకున్న ప్లానింగ్‌, బ‌డ్జెట్‌లో సినిమాను పూర్తి చేశాడు.  హ‌నుమాన్‌, భ‌ర‌త్ సంగీతం అందించిన ఈ సినిమాకి రాజ్‌తోట కెమెరా వ‌ర్క్ అందించారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్ చేశారు. ఈ స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు  చేస్తున్నాం`` అన్నారు. 
రుద్రాక్ష్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, కృష్ణుడు, మ‌ధునంద‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈచిత్రానికి సంగీతం:  హ‌నుమాన్‌, భ‌ర‌త్‌, కెమెరా:  రాజ్‌తోట‌, ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌:  ఆర్‌.కె.రెడ్డి, నిర్మాత‌: గ‌ణేష్ కొల్లురి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శ్రీప‌తి క‌ర్రి.