యాదాద్రి.మార్చి 19 (way2newstv.com):
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు టికెట్ కేటాయించిన రాహుల్ గాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం యాదాద్రిలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. యాదాద్రి నరసింహస్వామి ఆశీస్సులు తీసుకుని ప్రచారానికి శ్రీకారం చుట్టా.
కేసీఆర్ ఒక్కడివల్లే తెలంగాణ రాలేదు
ఈనెల 22న నామినేషన్ వేస్తా. ఈ ఎన్నికలు మోదీ-రాహుల్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటా. . తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నానని అన్నారు. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని నా కుటుంబంలా భావించి అండగా ఉంటా, ఆశీర్వదించండని ప్రజలన్ని కోరారు.