నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించండి : కలెక్టర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించండి : కలెక్టర్

కర్నూలు, మార్చి 18 (way2newstv.com)
నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై సోమవారం ఆర్వోలు, ఏఆర్వోలు, నోడల్ అధికారులు, ఎంపిడీవోలు తదితరులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్వోలు అందరూ ఎన్నికల మాన్యూవల్ ను బాగా చదవాలన్నారు. నామినేషన్ల వివరాల రిపోర్టును నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే తనకు పంపాలన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల దాఖలు సులభతరం చేయడానికి హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంట్ కు పోటీ చేసే అభ్యర్థి రూ.25000లు, అసెంబ్లీ కు పోటీచేసే అభ్యర్థి రూ.10000లు , అదే ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు అయితే 50 శాతం తో డిపాజిట్ ను డిడి రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. 


నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించండి : కలెక్టర్ 

అభ్యర్థులు ఏదేని జాతీయ బ్యాంకులో కొత్తగా ఖాతాను విధిగా ప్రారంభీంచి, ఎన్నికల లావాదేవీలు చూపించాల్సి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్ధులతో బ్యాలెట్ పేపర్ పై ముద్రించేందుకు గాను లేటెస్ట్ ఫోటోను తప్పక తీసుకోవాలన్నారు. 
అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం పై నిఘా ఉంచాం : 
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే వ్యయం పై నిఘాను ఉంచామని , ఇందుకు జిల్లా వ్యాప్తంగా సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులను ఇప్పటికే నియమించి తగు సూచనలు ఇచ్చామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు చేసే ఖర్చును పరిశీలించేందుకు సహాయ వ్యయ పరిశీలకులు, బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించి తగు శిక్షణ ఇచ్చామన్నారు. టీం వర్కు తో పనిచేయాలన్నారు. 
ఈ కార్యక్రమంలో వ్యయ పరిశీలకులు పంకజ్ జైన్, సందీప్ లక్రా, బైద్య నాథ్ సింగ్, దృబజ్యోతి రే ప్రసంగించగా, ఎస్ పీ పక్కీరప్ప, మునిసిపల్ కమీషనర్ ప్రశాంతి, డిఆర్వో వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.