న్యూఢిల్లీ మార్చ్ 14 (way2newstv.com)
జైషే మహ్మద్ అధినేత మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకోవడం దేశంలో రాజకీయ వివాదాలకు తెర లేపింది. మసూద్ అంశంపై చైనా అధ్యక్షుడిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు భాజపా దీటుగా బదులిచ్చింది. ‘చైనాకు ఆ అధికారం మీ ముత్తాత’ వల్లే వచ్చిందిగా అంటూ కౌంటర్ ఇచ్చింది.‘భారత్‌ను పక్కనబెట్టి మీ ముత్తాత చైనాకు అధికారాన్ని బహుమతి ఇవ్వకుంటే ఇప్పుడు ఐరాస భద్రతామండలిలో ఆ దేశం ఉండేది కాదు.
మీ ముత్తాత’ వల్లే చైనాకు ఆ అధికారం..రాహుల్‌కు బిజెపి కౌంటర్
మీ కుటుంబం చేసిన తప్పులను ఇప్పుడు భారత్ సరిదిద్దుకుంటూ వస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే ఈ పోరాటంలోనూ భారత్ తప్పకుండా విజయం సాధిస్తుందని మేం హామీ ఇస్తున్నాం. ఈ విషయాన్ని ప్రధాని మోదీకి వదిలేసి చైనా దౌత్యవేత్తలతో మీరు రహస్యంగా మంతనాలు జరపండి’’ అని భాజపా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది.