ఖమ్మం, మార్చి 28 (way2newstv.com)
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామంలో మాజీ ఎంపీ ఖమ్మం టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచ్ రామకృష్ణ తండ్రి సత్యనారాయణ ఇటీవల కాలంలో మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు .
కల్లూరు మండలంలో నామా నాగేశ్వరరావు పర్యటన
టిఆర్ఎస్ అభ్యర్థి నామా ఈ గ్రామానికి వస్తున్నారని సమాచారం తెలియడంతో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు , ఆత్మ చైర్మన్ కట్టా అజయ్ కుమార్, మాజీ సర్పంచ్ లక్కినేని కృష్ణ ,మేకల కృష్ణ ,బొప్పన శ్రీనాథ్ ,తోట కనకారావు తదితరులు పాల్గొన్నారు.