రాజంపేట మార్చ్ 30 (way2newstv.com):
కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ తెదేపాకు రాజీనామా చేశారు. రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయన ఎంపీ టికెట్ ఆశించారు. అధినేత చంద్రబాబు తనకు అవకాశం ఇవ్వకపోవడంతో పాటు పార్టీలో తగినంత గుర్తింపు లేదనే కారణాలతో ఆయన తెదేపాను వీడారు.
తెదేపాకు కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ గుడ్‌బై
ఈ మేరకు సీఎం చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపారు. రాజంపేట లోక్‌సభ టికెట్‌ను చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు తెదేపా కేటాయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సాయిప్రతాప్ తెదేపాకు గుడ్‌బై చెప్పారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన 2016 మార్చిలో కాంగ్రెస్‌ను వీడి తెదేపాలో చేరారు.