అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు వేయించండి : కలెక్టర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు వేయించండి : కలెక్టర్

కర్నూలు, మార్చి 08 (way2newstv.com)
తమ బిడ్డలకు అంగవైకల్యం రాకుండా 5 సంవత్సరాలలోపు ఉన్న వారందరికీ తప్పక పోలియో చుక్కలను వేయించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రజలకు ముందస్తు ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద ర్యాలీను జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.


 అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు వేయించండి : కలెక్టర్ 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు దారి చూపుతాయన్నారు. ఈ ఆదివారం జిల్లా అంతటా పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని తల్లి దండ్రులు వినియోగించుకుని అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న తమ పిల్లలకు ఈ చుక్కలను వేయించాలన్నారు.  ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ ప్రశాంతి, డీఎంహెచ్ఓ డా.ప్రసాద్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.