మార్గం సుగమం (నల్గొండ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మార్గం సుగమం (నల్గొండ)

నల్గొండ, మార్చి 24(way2newstv.com): 
జిల్లా వ్యాప్తంగా పురపాలక సంఘాల్లో గతంలో విలీనం చేసిన ఏడు గ్రామపంచాయతీలను మున్సిపాలిటీల్లో కలుపుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా పురపాలికల్లో ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఆయా మున్సిపల్‌ కమిషనర్లు గ్రామపంచాయతీల్లోని దస్త్రాలను, ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని   వ్యతిరేకిస్తూ గతంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు కోర్టులో వాజ్యం వేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో ప్రత్యేక  అధికారుల పాలన కొనసాగుతుంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ప్రస్తుతం జిల్లాలోని ఏడు గ్రామాలు ఐదు మున్సిపాలిటీల పాలనా పరిధిలోకొచ్చాయి.ప్రధాన గ్రామ పంచాయతీలను, పొరుగున ఉన్న గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం కొత్తగా ఐదు పురపాలికలను ఏర్పాటు చేసింది. ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌ గత ఆగస్టు నెలలో పురపాలక సంఘాలు ఆవిర్భవించాయి. పుర పాలక సంఘాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైంది.


మార్గం సుగమం (నల్గొండ)

గ్రామపంచాయతీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని పురపాలిక పరిధిలో అప్పట్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వం ప్రజల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోకుండా పురపాలికలను ఏర్పాటు చేయడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. తమ గ్రామాల విలీనంపై జిల్లావ్యాప్తంగా ఆరు గ్రామాల నాయకులు కోర్టు నుంచి యథాస్థితిపై మధ్యంతర ఉత్తర్వులు పొందారు. నాటి నుంచి నేటి వరకు గ్రామాల పాలన ప్రత్యేక అధికారులు పర్యవేక్షణలో కొనసాగుతుంది. ప్రస్తుతం సమస్య పరిష్కారం కావడంతో ఆయా మున్సిపాలిటీల్లో అధికారులు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో రూపొందించిన అనంతరం వార్డుల విభజన ప్రక్రియ ప్రారంభిచనున్నారు. ఏ కోర్టు కేసులేని యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఈ రెండు ప్రక్రియలను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయా గ్రామాలను మున్సిపల్‌ కమిషనర్లు స్వాధీనం చేసుకోవడంతో ప్రజలకు నిరంతరంగా సేవలు అందే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని ఐదు మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామాలను స్వాధీనం చేసుకొనే ప్రక్రియను ఇటీవలే ప్రారంభించారు. ఆయా గ్రామపంచాయతీల్లోని దస్త్రాలను తీసుకుటుంన్నారు. విలీన గ్రామపంచాయతీల దస్త్రాల స్వాధీన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తొమ్మిది ఫార్మెట్లు జారీ చేసింది. వాటిని పూరిస్తూ అన్ని వివరాలు అధికారులు నమోదు చేస్తున్నారు. భునవగిరి పాత మున్సిపాలిటీలో మూడు గ్రామాలు విలీనమయ్యాయి. ఆయా గ్రామ పంచాయతీల్లోని దస్త్రాలు, ఆస్తులు స్వాధీనం చేసుకొనేందుకు మూడు అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. ఆస్తి పన్ను, ఆమోదిత లే అవుట్ల వివరాలు, ఇప్పటి వరకు ఇచ్చిన అభవన అనుమతులు వివరాలు, పారిశుద్ధ్య నిర్వహణ వివరాలను సేకరిస్తున్నారు. పాత బ్యాం కు అకౌంట్లను మూసి వేసి కొత్తగా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందితోనే స్థానికంగా పనులు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.