హైదరాబాద్, మార్చి 11, (way2newstv.com )
ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ తేదేపాకు ఊహించని షాకిచ్చారు. సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో అయన వైకాపా అధినేత వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. సినీనటుడు అలీకి వైసీపీ కండువా కప్పిన అనంతరం జగన్, చంద్రశేఖర్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
జగన్ తో మంత్రి దేవినేని ఉమ సోదరుడు భేటీ
ఈ సందర్బంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ అనేక రకాల కారణాలు వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. అధికార పార్టీ దోపిడీ ఎక్కువగా ఉంది. పట్టిసీమ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టు లో దోపిడీ అధికంగా ఉంది. కేసుల నుండి టీడీపీ నేతలు బయటపడ లేరని అయన అన్నారు. మైలవరం నియోజవర్గంలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చంద్రశేఖర్ తెలిపారు.