యాంత్రిక జీవితాల‌కు ఊర‌ట క్రీడ‌లు యాంత్రిక జీవితాల‌కు ఊర‌ట క్రీడ‌లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యాంత్రిక జీవితాల‌కు ఊర‌ట క్రీడ‌లు యాంత్రిక జీవితాల‌కు ఊర‌ట క్రీడ‌లు

జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారులు కిర‌ణ్ రెడ్డి
ఓయూలో  5 కె ర‌న్ విజేత‌ల‌కు ముఖ్య అతిథిగా జ్ఞాపిక‌ల బ‌హుక‌ర‌ణ‌
హైదరాబాద్ మార్చ్ 4 (way2newstv.com
వ్యాయామం చేయ‌డం ద్వారా శరీరం ఆరోగ్యంగా, ధృడంగా ఉంటుందని, ప్రతిఒక్కరు ఆరోగ్య నియామాలు పాటించాలని టి.ఎస్‌.ఆర్టీసీ సీనియ‌ర్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ మేనేజ‌ర్, జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారులు  జి.కిర‌ణ్ రెడ్డి అన్నారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలోని ఇంజ‌నీరింగ్ క‌ళాశాల, ట‌క్సోనెన్స్ 2కె19 నిర్వ‌హ‌ణ‌లో శ‌నివారం ఉద‌యం   నిర్వ‌హించిన 5కె రన్ పోటీల‌ను ఆయ‌న ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ 5కె రన్‌లో పెద్దఎత్తున విద్యార్థులు, పెద్దలు ఆనందంగా, కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 50 ఏళ్ల లోపు, 50 ఏళ్ల పైబ‌డిన వారు ఈ పోటీలు ఎంతో ఉల్లాసంగా ప‌రుగులు తీశారు. అనంతరం 5కె రన్ కార్యక్రమంలో గెలుపొందిన వారికి  ఆయ‌న  షీల్డ్స్ అంద‌జేసి వారిని ఉద్దేశించి  మాట్లాడుతూ, 5కె ర‌న్ వ‌ల్ల‌  ఆనందం, ఆరోగ్యం సాకారం అవుతుందన్నారు.  



 యాంత్రిక జీవితాల‌కు ఊర‌ట క్రీడ‌లు 

పెద్ద వారిలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు 5 కె రన్ పోటీలు ఎంతగానో దోహదపడతాయ‌ని, ఆట‌లు యాంత్రిక జీవితాలకు కాస్త ఊర‌టనిస్తాయ‌ని చెప్పారు. ఎవ‌రికైనా సంకల్పబలం ఉండే ఏదైనా సాధించవచ్చని, అలాగే తల్లిదండ్రులు పిల్లల్లో జ్ఞానం, ధైర్యం, దేహ దారుఢ్యం, శ్రమ అలవర్చేలా పెంచాలని, తద్వారా పిల్లలు చురుగ్గ్షా ఉంటారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారయ్యేలా పిల్లలను పెంచిన‌ప్పుడే ప్‌కయోజ‌కులుగా త‌యార‌వుతార‌ని అభిప్రాయాన్ని వ్య‌క్త ప‌రిచారు. నిర్వ‌హ‌కులు ఫ్రొఫెస‌ర్  మ‌ల్లేశం, వారి టీంను ఆయ‌న అభినందిస్తూ 5కె రన్ వంటివి మరిన్ని జరపాలని సూచించారు. 5 కె ర‌న్ ద్వారా సేక‌రించిన విరాళాల‌ను సి.ఆర్‌.పి.ఎఫ్ సైనికుల సంక్షేమ నిధికి అంద‌జేయడం స్ఫూర్తిదాయ‌క‌మ‌న్నారు. విజేత‌లు మ‌హిళా విభాగంలో గాయ‌త్రి (ప్ర‌థ‌మ‌), శ్రేయ (ద్వితీయ‌), మ‌మ‌త (తృతీయ‌)లు, పురుషుల విభాగంలో యోగేశ్వ‌ర్ (ప్ర‌థ‌మ‌), ర‌మేశ్ (ద్వితీయ‌), ప్ర‌శాంత్ (తృతీయ‌) లు విజేత‌లుగా నిలిచారు. వీరికి షీల్డ్స్ అంద‌జేసి ఆయ‌న అభినందించారు.  కార్య‌క్ర‌మంలో ఒయూ వైస్ ఛాన్స్‌ల‌ర్ ఎస్‌.రాంచంద్ర‌మ్‌, ఇ.ఇ.ఇ. హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఫ్రొఫెస‌ర్ ర‌మ‌ణారావు, నిజాం కాలేజ్ ప్రిన్సిఫాల్ ల‌క్ష్మీ కాంత‌రావు రాథోడ్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.