కర్నూలు, మార్చి 12, (way2newstv.com)
అమరావతిలో టీడీపీ ఆశావహుల ఉత్కంఠ కొనసాగుతోంది. టికెట్లకోసం సుజనా కమిటీతో విడివిడిగా భేటీలు అవుతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 8స్థానాల అభ్యర్థుల ఖరారు చేసిన సియం చంద్రబాబు కర్నూలు, ఆదోని, కోడుమూరు, నంద్యాల, నందికొట్కూరు, ఆలూరు నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు. కర్నూలు స్థానం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ పట్టు పడుతున్న విషయం తెలిసిందే.
అమరావతిలో కర్నూలు ఆశావహులు
ఆదోని లో అభ్యర్థి ఎంపిక పై కసరత్తు కొనసాగుతోంది. ఇక్కడ మీనాక్షి నాయుడు , బుట్టా రేణుక రేసులో ఉన్నారు. ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని బుట్టా పట్టుపడుతున్నారు. మరోవైపు, నంద్యాల సీటు కోసం ఏవీ సుబ్బా రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి, ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ బరిలో ఉండే అవకాశం వుంది. తనకు న్యాయం చేయాలన్న ఆలూరు ఇంఛార్చ్ వీరభద్ర గౌడ్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు. మిగిలిన స్థానాల పై బుధవారం లోపు స్పష్టత వచ్చే అవకాశం వుందని పార్టీ వర్గాల సమాచారం. ఈనెల 18 తేదీనాడు జిల్లాలో సియం పర్యటన వుంది. అంతలోపే అభ్యర్థుల ఎంపిక పూర్తి కావచ్చని నేతలు అంటున్నారు.