నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి మల్లరెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి మల్లరెడ్డి

మేడ్చల్, మార్చి 9, (way2newstv.com
మేడ్చల్ జిల్లాలోని షామిర్ పెట్ మండలంలోని మూఢుచింతలపల్లి గ్రామాన్ని  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మూఢుచింతలపల్లిని నూతనంగా  మండలం గా ఏర్పాటు చేయడం జరిగింది, మూఢుచింతలపల్లి మండలకేంద్రాన్ని శనివారం రాష్ట్ర మంత్రి  చామకూర మల్లరెడ్డి  ఆవిష్కరించారు, ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గత యడాది ఆగస్టు 8 తేదీన గ్రామానికి వచ్చిన సందర్భంగా మూఢుచింతలపల్లి గ్రామాన్ని  మండల కేంద్రంగా  ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 


నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి మల్లరెడ్డి

ఈ మేరకు ఈ మండలానన్ని  ప్రారంభించామని అన్నారు. నూతన మండలం ద్వారా పరిపాలన పరంగా గ్రామాలకు ప్రజలకు దగ్గరవుతుందని, ముఖ్యమంత్రి  ఆశయాలు మేరకు ప్రతి ఇంటికి ఆరు చెట్లు పెట్టాలని గ్రామంలోని ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని ఆయన సూచించారు.  ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి, ఎమ్మార్వో గోవర్ధన్, స్థానిక ఎంపీపీ.చంద్రశేఖర్, మేడ్చల్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సుగుణ, గ్రామ సర్పంచ్ జాం రవి, మాజీ సర్పంచి పద్మ లక్ష్మారెడ్డి, తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు.