మురళీ మోహన్ అస్త్ర సన్యాసం వెనుక స్టోరీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మురళీ మోహన్ అస్త్ర సన్యాసం వెనుక స్టోరీ

రాజమండ్రి, మార్చి 4, (way2newstv.com
ఇదిగో మీపై వచ్చిన సర్వేల నివేదికలు. ఇదిగో మీ పై వున్న అభియోగాల రీడ్ ఫైల్. చదువుకోండి. టిడిపి కి ఆదినుంచి అండగా వుంటూ వచ్చిన మీకు టికెట్ ఇవ్వడం లేదని నేను అంటే బాగోదేమో ఆలోచించండి. మీకు మీరే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తే పార్టీకి మీకు గౌరవంగా ఉంటుందేమో ఆలోచించండి.” ఇది రాజమండ్రి సిట్టింగ్ ఎంపి మాగంటి మురళి మోహన్ కి టిడిపి అధినేత చంద్రబాబు చేసిన గీతోపదేశం అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపుతుంది. ఈ నేపథ్యంలోనే ఎంపి మురళి మోహన్ హుందాగా ప్రకటన చేసి పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.ఆయన తప్పుకోవడంతో బాటు కోడలు రూపా కూడా పోటీలో ఉండబోవడం లేదని ప్రకటించడానికి ఇదే కారణం అంటున్నారు. 



మురళీ మోహన్ అస్త్ర సన్యాసం వెనుక స్టోరీ

మొన్నటి వరకు టికెట్ పై ధీమాతోనే దాదాపు రెండుకోట్ల రూపాయల విలువైన మొబైల్ మెడికల్ వ్యాన్ ను అత్యధిక సౌకర్యాలతో తయారు చేయించిన మురళి మోహన్ పలు నియోజక వర్గాల్లో ఇప్పటికే మెగా మెడికల్ క్యాంప్ లు భారీగా నిర్వహించారు కూడా. ఇక ప్రచారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్న దశలో ఆయన నిర్ణయం మురళి మోహన్ సన్నిహిత వర్గాలను షాక్ కు గురిచేసింది.సౌమ్యుడు గా ప్రముఖ సినీనటుడిగా పేరున్న మురళి మోహన్ పై రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తొలి రోజు నుంచి ఇసుక మాఫియా డాన్ గా ఆయన ప్రత్యర్ధులు పెద్ద ఎత్తున ప్రచారంలోపెట్టేశారు . దీనికి తోడు అమరావతి లో భూములు వందల కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ కింగ్ అయిపోయారంటూ దుమారమే రేగింది. వీటిని మురళి మోహన్ అనేక సందర్భాల్లో తీవ్రంగా ఖండించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇవి కాక వయోభారంతో వెంకన్న చౌదరి అంటూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామీ పై చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీశాయి.ఆయన హయాంలో రాజమండ్రి కి జరిగిన అభివృద్ధి శూన్యమంటూ ఇటీవల సోషల్ మీడియా లో నెటిజెన్స్ గగ్గోలు పెడుతూ రావడం ఇవన్నీ సర్వేల్లో బయటపడటం యుద్ధానికి ముందే మురళి మోహన్ అస్త్ర సన్యాసం చేయడానికి దారి తీసిన పరిస్థితి గా ప్రచారం జోరుగా నడుస్తుంది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఉండవల్లి అరుణ కుమార్ పై ఓటమి పాలయిన మురళి మోహన్ 2014 లో వైసిపి అభ్యర్థి బొడ్డు వెంకటరమణపై భారీ మెజారిటీ తో గెలిచినా 2019 ఎన్నికల్లో పోటీ కి నై అని చెప్పేవరకు తన రాజకీయ ప్రస్థానం సాగించడం తో ముగిసింది. గెలిచినా ఓడినా రాజమండ్రిలోనే ఉంటానని సొంత ఇల్లు కూడా నిర్మించుకున్న మురళి మోహన్ తనమాటపై నిలబడతారా లేక దుకాణం మూసేసి అమరావతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిజీ అవుతారో చూడాలి.