శ్రీశైలం దేవస్థానం పీఆర్వో శ్రీనివాస్ పై హత్యాయత్నం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీశైలం దేవస్థానం పీఆర్వో శ్రీనివాస్ పై హత్యాయత్నం

శ్రీశైలం, మార్చి 12, (way2newstv.com)
కర్నూలు .ఇల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం దేవస్థానం పీఆర్వో శ్రీనివాస్ పై హత్యాయత్నం జరిగింది. ఈవో శ్రీ రామచంద్రమూర్తి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడి బయటకు రాగానే  ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ పై కత్తితో దాడి చేశారు. దీంతో శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 


శ్రీశైలం దేవస్థానం పీఆర్వో శ్రీనివాస్ పై  హత్యాయత్నం

ఈవో ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ కు , ఛాతి పై బలంగా గాయాలు అయ్యాయి. నిందితులు కర్నూలు వాసులుగా గుర్తించారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని వైదులు తెలిపారు . పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి నంద్యాల నందమూరి నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.