అనంతపురం, మార్చి 1 (way2newstv.com)
గుంతకల్లు, గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లను కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో గుంతకల్లు రైల్వే డివిజన్‌లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ఆవిరయ్యాయి. 1956లో గుంతకల్లు రైల్వే డివిజన్ ఏర్పాటైంది. అనంతరం మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు రైల్వే డివిజన్ సౌతర్న్ రైల్వేలో భాగంగా ఉండేది.
గుంతకల్లు రైల్వే డివిజన్ ఆశలు ఆవిరి
1972లో జరిగిన రాష్ట్రాల పునర్విభజన అనంతరం గుంతకల్లు రైల్వే డివిజన్‌ను సికింద్రాబాద్ జోన్‌లోకి విలీనం చేశారు. ఈనేపథ్యంలో విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రైల్వేజోన్‌ను విశాఖగా ప్రకటించారు. దీంతో విశాఖ రైల్వే జోన్‌లోకి గుంతకల్లు రైల్వే డివిజన్‌ను త్వరలోనే విలీనం చేయనున్నారు. దాదాపు 1872 కిలోమీటర్ల పొడవు ట్రాక్ కలిగిన గుంతకల్లు రైల్వే డివిజన్ ఆంధ్రప్రదేష్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణల రాష్ట్రాలో వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, తెలంగాణలోని మహాబూబ్ నగర్, కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్, యాదగిరి, బళ్లారి, తమిళనాడు వెల్లూరు జిల్లాలో గుంతకల్లు డివిజన్ విస్తరించింది.
Tags:
Andrapradeshnews