నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్

ఫామ్ 7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవే..
వివరాలు ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం..
విజయవాడ, మార్చి 23 (way2newstv.com)
ఏపీలో ఏఏ జిల్లాలో ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నామో జాబితాను  ఏపీ ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.  రాష్ట్రంలో ఓట్ల తొలగింపునకు ఇటీవల దాఖలైన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే..  ఓట్లను తొలగించాల్సిందిగా తమకు 9.5 లక్షల దరఖాస్తులు అందగా,వాటిలో కేవలం 1.41 దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని స్పష్టం చేసింది. 


నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్

ఈ సందర్భంగా జిల్లాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలను ఈసీ ప్రకటించింది.ఇందులో సగం నకిలీ ఓట్లు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. శ్రీకాకుళం - 2,579, విజయనగరం- 5,166, విశాఖపట్నం- 2,407, పశ్చిమ గోదావరి- 8,669, ప్రకాశం- 6,040, నెల్లూరు- 3,850, కడప- 5,292, కర్నూలు- 7,684,  అనంతపురం- 6,516,  గుంటూరు- 35,063, తూర్పుగోదావరి- 24,190,  కృష్ణా- 19,774, చిత్తూరు- 14,052 నకిలీ ఓట్లు వున్నట్లు ఈసీ వెల్లడించింది.